కరోనా పుట్టినిల్లు చైనా కాదు.. అమెరికానే.. ఆ ల్యాబ్ నుంచే బయటకు
Coronavirus: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనానే అంటూ అగ్రరాజ్యం అమెరికా తొలినుంచి ఆరోపిస్తూ వస్తుంది.
Coronavirus: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనానే అంటూ అగ్రరాజ్యం అమెరికా తొలినుంచి ఆరోపిస్తూ వస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు అమెరికా వాదనతో ఏకీభవించాయి. దీంతో చైనా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్త అంశం తెరమీదకు తెచ్చింది చైనా. కరోనా వైరస్ అమెరికా సృష్టే అంటూ ఆరోపణలు చేస్తుంది. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అమెరికానే అని ప్రత్యారోపణలు చేసింది. ఈ సంచలన ఆరోపణల చేసింది ఏవరో కాదు చైనా విదేశాంగ అధికారప ప్రతినిధి వాంగ్. ఈ ఆరోపణన వెనక కొన్ని ఆధారాలు కూడా చెబుతున్నారు.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ అమెరికాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తద్వారా కరోనా వైరస్ మూలాలు ఎక్కడివన్న అంశాన్ని నిగ్గు తేల్చాలని అన్నారు. అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉత్పన్నమైనట్టు పలు రిపోర్టులు చెబుతున్నాయని వెన్సిన్ పేర్కొన్నారు. అమెరికా గోప్యంగా ఉంచిన నివేదికలో వుహాన్ ల్యాబ్ లో కరోనా మూలాలకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రత్యారోపణలకు దిగినట్టు అర్థమవుతోంది.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ మాట్లాడుతూ.. గతంలో తమపై ఆరోపణలు వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తుకు సహకరించామని, ఇప్పుడు అమెరికా కూడా డబ్ల్యూహెచ్ఓ నిపుణులతో దర్యాప్తుకు ముందుకు రావాలని వెన్సిన్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఫోర్ట్ డెట్రిక్ ల్యాబొరేటరీపై అనేక ఆరోపణలు ఉన్నాయని, డబ్ల్యూహెచ్ఓ తనిఖీలకు అమెరికా అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో అమెరికా మీడియాతో పాటు నిపుణులు చైనాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచానికి కరోనా గురించి తెలియకముందే వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లో పలువురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొనడమే కాకుండా, ఆ సిబ్బంది మెడికల్ రికార్డులు వెల్లడి చేయాలని చైనాను డిమాండ్ చేశారు. అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ భారీ కథనాన్ని ప్రచురించింది. 2019 నవంబరుకు ముందే వుహాన్ ల్యాబ్ నుంచి కొందరు ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించింది.