Actress: అందంగా ముస్తాబైన ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? అచ్చ తెలుగు ముద్దుగుమ్మ
Can you guess this telugu actress in this photo: సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫొటోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు స్వయంగా తమ చిన్ననాటి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతుంది. పైన ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఎర్ర చీరలో అందంగా తయారైన ఈ చిన్నారి ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్. ఎంతకీ ఈ క్యూట్ గర్ల్ ఎవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది తెలుగు అమ్మాయిల్లో ఈ బ్యూటీ ఒకరు. తెలుగుకే పరిమితం కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తన సహజ నటనతో ఆడిపాడింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ వెంకటేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇంతకీ చిన్నారి ఎవరో ఈపాటికే మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది కదూ! అవును ఈ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార అంజలి.
20006లో వచ్చిన 'ఫొటో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. ఆ తర్వాత మాత్రం తెలుగు మూవీస్‌లో పెద్దగా నటించలేదు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. 2012లో వచ్చిన సీతామ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు తమిళంలో మరో సినిమాలో నటిస్తోంది.