Kiran Rathod: హౌస్‌లో ఉన్నది వారం రోజులే.. ఎంత సంపాదించిందో తెలుసా?
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మైదలైన నాటి నుంచి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్లుకుంటోంది.
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మైదలైన నాటి నుంచి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్లుకుంటోంది. సక్సెస్ ఫుల్‌గా తొలి వారం పూర్తి చేసుకుంది. అయితే, తొలివారం హౌస్ నుంచి ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ బయటకు వచ్చింది. ఎన్నో వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలని కోరుకున్నా.. తెలుగు రాకపోవడమే ఆమెకు మైనస్ పాయింట్ అయింది. దీంతోపాటు పలు కారణాలతో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.
రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన కిరణ్ రాథోడ్ పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ హౌజ్‌లో అందరితో స్నేహం చేయలేకపోయింది. వీటితోపాటు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనలేకపోయింది. హోస్ట్ నాగార్జున కూడా పలుమార్లు హెచ్చరించినా.. పెద్దగా పట్టించుకోలేదు.
తెలుగు రాకపోవడంతోనే హౌజ్‌మేట్స్ అంతా కిరణ్‌ను నామినేట్ చేశారు. అలాగే అభిమానులు కూడా ఈమెను సేవ్ చేయలేకపోయారు. దీంతో కిరణ్ రాథోడ్‌కు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది.
కాగా, కేవలం వారం రోజులు బిగ్‌బాస్ హౌజ్ గడిపిన కిరణ రాథోడ్.. భారీగానే వెనకేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకు రూ.45వేల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా వారం రోజులుకుగానూ రూ.3 లక్షలకు పైగానే తీసుకెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.