Akira Nandan: పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అకీరా
Akira Nandan: తండ్రి సినిమాతో డెబ్యూ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ తనయుడు
Akhira Nandan: మెగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ డెబ్యూ కోసం అని చెప్పవచ్చు. సినిమాల్లోకి ఇంకా రాకపోయినప్పటికీ అకీరానందన్ కీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అకీరా ని ఎప్పుడు హీరోని చేస్తారా అంటూ రేణుదేశాయ్ అని అడుగుతూ ఉంటారు. ఇప్పటికే మరాఠీ లో ఒక సినిమా చేసిన అకీరానందన్ తెలుగులో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ ఒకప్పుడు జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన తండ్రి పవన్ కళ్యాణ్ సినిమాతోనే అకీరానందన్ తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "హరిహర వీరమల్లు" అనే సినిమాలో అకీరానందన్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు అని ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా 60 శాతం పూర్తయిందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది. నిధి అగర్వాల్ మరియు జాక్వలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఒక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.