దొంగతనాలు చేయడమంటే ఇష్టమంటున్న రవితేజ హీరోయిన్

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకొని ప్రేక్షకులను మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న రెడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Update: 2020-11-24 06:06 GMT

రవితేజ హీరోగా వచ్చిన నేల టికెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది మాళవిక శర్మ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకొని ప్రేక్షకులను మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న రెడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టింది మాళవిక. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా పట్టాలేక్కనున్నాయి.

ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే మాళవికా, ఇటీవల తన అభిమానులతో ముచ్చటించింది. తన గురించి ఎవరికీ తెలియని ఓ నిజాన్ని బయటపెట్టింది ఈ భామ. తానూ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నట్టుగా వెల్లడించింది. అంటే ఈ సమస్య ఉన్నవారు తమకి దగ్గరలో ఉన్న చిన్నచిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట.

ఈ సమస్య చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఈ సమస్య ఓ హీరోయిన్ కి ఉండడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇక తానూ ఈ సమస్య కారణంగా ఎన్నోసార్లు ఇబ్బంది పడినట్టుగా మాళవిక వెల్లడించింది. అటు తానూ లాయర్ కావాలని అనుకునేదానిని కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్టుగా వెల్లడించింది. అంతేకాకుండా తనకి మొదటి సినిమా ఛాన్స్ ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఇచ్చారని దానిని తానూ ఎప్పటికి మరిచిపోలేనని వెల్లడించింది మాళవిక. 

Tags:    

Similar News