Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక పరిణామం

Raj Tarun-Lavanya Case: ప్రేమ, పెళ్లి పేరుతో లావణ్యను రాజ్‌తరుణ్ మోసం చేశాడన్న పోలీసులు

Update: 2024-09-10 15:11 GMT

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక పరిణామం

Raj Tarun-Lavanya Case: నటుడు రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో.. లావణ్యను రాజ్‌తరుణ్ మోసం చేశాడని ఛార్జిషీట్‌లో చేర్చారు పోలీసులు. అందులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొన్నారు. సెక్షన్స్ 420, 493, 506 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో మొత్తం 6గురి సాక్షాలను సేకరించారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్ ఇంట్లో ఉన్న పనిమనిషి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. గచ్చిబౌలి ఎల్లమ్మ గుడిలో 2014లో పసుపుతాడు కట్టి లావణ్యని పెళ్లి చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.

2017లో కోకాపేటలోని ఓ విల్లాకు షిఫ్ట్ అయ్యారని, పెళ్లిని రిజిస్టర్ చెయ్యమని లావణ్య పట్టుబట్టినప్పటి నుండి రాజ్ తరుణ్ దూరం పెట్టారని ఛార్జిషీట్‌లో నమోదు చేశారు. 2016లో రెండు నెలల గర్భస్రావం కూడా అయ్యిందన్నారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందగా ఆ బిల్స్‌ను రాజ్ తరుణే కట్టాడన్నారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో రాజ్‌తరుణ్‌ చిక్కుల్లో పడినట్టైంది. ఇక ఈ కేసు ఎటు టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News