Vimanam Movie Review: విమానం మూవీ రివ్యూ.. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే సినిమా..
Vimanam Movie Review: సముద్రఖని, అనసూయ కీలక పాత్రలో నటించిన మూవీ ‘విమానం’.
చిత్రం: విమానం
నటీనటులు : సముద్రఖని,ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు..
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
విడుదల తేది : 9/6/2023
Vimanam Movie Review: సముద్రఖని, అనసూయ కీలక పాత్రలో నటించిన మూవీ 'విమానం'. హృదయాన్ని తాకే భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే సినిమా 'విమానం' ఈ చిత్రంలో అవిటివాడైన తండ్రి పాత్రలో నటించారు సముద్రఖని. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై కిరణ్ కొర్రపాటి నిర్మించిన సినిమాకు శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా ఎలావుందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
వీరయ్య (సముద్రఖని) వికలాంగుడు. కుమారుడు రాజు (ధ్రువన్)వీరయ్యకు సులభ్ కాంప్లెక్స్ అతని జీవనాధారం. అబ్బాయే అతని జీవితం. కొడుకు రాజుకు విమానం ఎక్కాలని కోరిక బలంగా ఉంటుంది. ఎప్పుడూ విమానం గోలే. తనను ఎలాగైనా విమానం ఎక్కించాలనుకుంటాడు వీరయ్య..కానీ అతనికి జీవనాదారం అయిన సులభ్ కాంప్లెక్స్ ను గవర్నమెంట్ వారు కూల్చేస్తారు. ఈ సమయంలో వీరయ్యకు తన కొడుకు గురించి షాకింగ్ న్యూస్ వింటాడు. ఆ తర్వాత ఏమైంది? పేదరికంలో బ్రతుకుతున్న వీరయ్య తన కొడుకును విమానం ఎక్కిస్తాడా..? లేదా ? అనేది తెరపై చూడాలసిందే.
సినిమా చూస్తున్నంతసేపు తండ్రి , కొడుకుల మధ్య సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తండ్రీ కుమారుల మధ్య సంభాషణలు, కుమారుడి మాటల్లో ఏమీ తెలియని అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా ఆకట్టుకుంటాయి. నటన విషయంలో ప్రతీ ఒక్కరు చక్కగా నటించారు. ముఖ్యంగా సముద్రఖని అవిటి వాడి పాత్రలో నటించడం ఓ గొప్ప విషయం. ఫస్ట్ హాప్ మొత్తం క్యారెక్టర్లను పరిచయం చేయడం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ప్రేమను చూపించడంలోనే ముగిసిపోయింది. ఇక సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా మారిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే అతిపెద్ద ట్విస్ట్ గుండెల్ని బరువెక్కిస్తుంది. బయటకు వచ్చే ప్రతి ఒక్కరు బరువెక్కిన హృదయంతో బయటకు వస్తారు.
సాంకేతిక విషయానికి వస్తే . శివ ప్రసాద్ యానాల ఎమోషన్ డ్రామాని ప్రేక్షకుల హృదయాన్ని తాకేలా సినిమాను అందించడములో సక్సెస్ అయ్యారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి మనసుకి హత్తుకునేలా కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చేలా సినిమాను అందించారు. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాకి తప్పకుండా ప్రేక్షకులు ఫిదా అవుతారు అనడంలో అతిశ్రేయోక్తి లేదు. జీ స్టూడియోస్ , కిరణ్ కొర్రపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి. చరణ్ అర్జున్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. హను రావూరి డైలాగ్స్ హృదయాన్ని తాకేలా ఉన్నాయి. చివరగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే సినిమా ఈ 'విమానం'.