Konda Polam Movie Review: 'కొండపొలం' సినిమా ఎలా ఉందంటే..
Konda Polam Movie Review: 'కొండపొలం' సినిమా ఎలా ఉందంటే..
Konda Polam Movie Review: సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు. "ఉప్పెన" సినిమాతో అరంగేట్రం చేసిన వైష్ణవ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన "ఉప్పెన" సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వైష్ణవి తేజ్ కి సాలిడ్ డెబ్యూ వచ్చింది.
నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా "కొండ పొలం" అనే సినిమా షూటింగ్ ని పూర్తి అయింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చి ఇన్ని రోజులకి ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరొకసారి పల్లెటూరి డ్రాప్ తో వైష్ణవ్ తేజ్ ఎంతవరకు అలరించాడో చూసేద్దామా.
చిత్రం: కొండపొలం
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, తదితరులు
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేది: 08/10/2021
కథ:
రవి (పంజా వైష్ణవ్ తేజ్) గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టినవాడు అయినప్పటికీ విజయవంతంగా ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం నాలుగేళ్లు ప్రయత్నాలు చేసినప్పటికీ తనకి మంచి ఉద్యోగం దొరకదు. ఇక చేసేది లేక తిరిగి తన వాళ్లతో కలిసి కొండ పొలానికి వెళ్లి గొర్రెలు కాయడానికి సిద్ధమవుతాడు రవి. మరి ఆడవిలో రవి కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎలాంటి ఆపదలు కలిగాయి? చివరికి రవి ఏం నేర్చుకున్నాడు? కొండపొలం తన జీవితాన్ని ఏరకంగా మార్చింది? ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సింగ్) తో రవి ఎలా ప్రేమలో పడ్డాడు? చివరికి వారి ప్రేమ కథ ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
రవి పాత్రలో చాలా బాగా నటించాడు వైష్ణవ్. తన అద్భుతమైన నటనతో తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు వైష్ణవ్ తేజ్. కళ్ళతోనే భావోద్వేగాలను పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓబులమ్మ పాత్రలో లో రకుల్ ప్రీత్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తన పాత్రలో ఒదిగిపోయి రకుల్ తన అందం మరియు అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. వైష్ణవ్ తో రకుల్ కెమిస్ట్రీ చాలా బాగుంది. కోట శ్రీనివాసరావు నటన కూడా ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. సాయి చంద్ కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. నాజర్ మరియు అన్నపూర్ణ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు క్రిష్ ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన ఎమోషనల్ కథను రాసుకున్నారు. సున్నితమైన భావోద్వేగాల ను చాలా బాగా చూపించారు. కొన్ని చోట్ల పాత్రలకు ఏమవుతుంది అని ఆసక్తి అందరికీ కలిగేలా చేశారు. పాత్రల మధ్య ఎమోషన్స్ ని కూడా క్రిష్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసారు. అయితే కొన్నిచోట్ల మెలోడ్రామా బాగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది. జ్ఞానశేఖర్ సినిమాకి మంచి విజువల్స్ ని అందించారు. డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
బలాలు:
- నటీనటులు
- రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రలు
- అడవిలోని పులి తో ఫైట్ సీన్
- భావోద్వేగాలు
బలహీనతలు:
- స్లో నేరేషన్
- మెలో డ్రమాటిక్ సన్నివేశాలు
- అవసరం లేని కామెడీ సీన్స్
- సెకండ్ హాఫ్ లో ని లాగ్ సన్నివేశాలు
చివరి మాట:
ఫస్ట్ హాఫ్ నుంచి కథ స్లో గానే నడుస్తూ ఉంటుంది. ఇంట్రడక్షన్ తరువాత కూడా నెరేషన్ లో స్పీడ్ ఏ మాత్రం పెరగదు. స్లో సన్నివేశాలు మరియు భావోద్వేగాల వల్ల కొన్ని సన్నివేశాలు మెలో డ్రామాటిక్ గా అనిపించాయి. అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సినిమా సన్నివేశాలు బాగానే అలరించాయి కానీ సినిమాకి వాటివల్ల ఉపయోగం లేదు అనిపిస్తుంది. కథ నెరేషన్ గ్రిప్పింగ్ గా లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్. పైగా రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత విసుగు తెప్పిస్తాయి. అయినప్పటికీ ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెప్పుకోవచ్చు.
బాటమ్ లైన్:
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామా చూడాలనుకునే వాళ్లకోసం "కొండపొలం".