Family Star Movie Review: ‘ ఫ్యామిలీ స్టార్‌’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

Family Star : ‘గీతగోవిందం’ తరువాత దర్శకుడు పరుశురామ్ తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’.

Update: 2024-04-05 10:49 GMT

Family Star Movie Review: ‘ ఫ్యామిలీ స్టార్‌’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

టైటిల్‌: ఫ్యామిలీ స్టార్‌

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్‌ ఘోష్‌

నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

నిర్మాతలు: దిల్‌ రాజు, శిరీష్‌

రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల

సంగీతం: గోపీ సుందర్‌

సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

విడుదల తేది: ఏప్రిల్‌ 5, 2024

Family Star : ‘గీతగోవిందం’ తరువాత దర్శకుడు పరుశురామ్ తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అండ్ ట్రైలర్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ని అందుకుందా..?

క‌థేంటంటే: గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజినీర్‌గా ఎక్కువ సంపాదించే అవ‌కాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. మ‌ద్యానికి బానిసైన పెద్ద‌న్న‌య్య‌, ఇంకా జీవితంలో స్థిర‌ప‌డే ద‌శ‌లోనే ఉన్న చిన్న‌న్న‌య్య‌. వాళ్ల కుటుంబాల మంచీ చెడుల్ని చూస్తూ చాలీ చాల‌ని జీతంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. వ‌చ్చీ రాగానే అత‌ని కుటుంబాన్నీ అర్థం చేసుకుని వాళ్ల‌తో క‌లిసిపోతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ని ఎలా ప్ర‌భావితం చేసింది?అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ జీవితంలోకి ఎలా వ‌చ్చింది? అత‌ను మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

టాలీవుడ్‌లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్‌గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది.

అలాంటి కాంబినేషన్‌లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్‌’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్‌ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్‌ చేసే పరశురామ్‌.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్‌ సరిపోలేదనిపిస్తుంది.

విజ‌య్ చూడ్డానికి బాగున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా క‌నిపించాడు. సినిమాని దాదాపుగా త‌న భుజాల‌పై మోశాడు. న‌ట‌న‌, బాడీ లాంగ్వేజ్‌… ఈ విష‌యాల్లో పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. త‌న వ‌ర‌కూ మైన‌స్సులు క‌నిపించ‌వు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. సీతారామం లాంటి డెప్త్ ఉన్న క్యారెక్ట‌ర్ కాదు. కొన్ని కొన్ని ఫ్రేముల్లో విజ‌య్ కంటే.. పెద్ద‌దానిలా క‌నిపించింది. సెకండాఫ్‌లో ఈ పాత్ర‌ని పూర్తిగా సైలెంట్ చేసేశాడు ద‌ర్శ‌కుడు. అందుకే మృణాల్‌కి కూడా పూర్తిగా ఓపెన్ అయ్యే స్కోప్ లేకుండా పోయింది. జ‌గ‌ప‌తిబాబు రొటీన్‌ రిచ్ డాడ్ పాత్ర‌లో… అల‌వాటైన ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఏదో లాగించేశాడు. వెన్నెల కిషోర్ ఉన్నా.. త‌న మార్క్ కామెడీ ఈ సినిమాలో క‌నిపించ‌దు. రోహిణి అట్టంగ‌డిని చూస్తే ఎందుకో సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆమె చేసిన‌ పాత్రే క‌ళ్ల ముందు మెదులుతుంటుంది. ఆ పాత్ర‌నే ఇక్క‌డా ప్ర‌తిష్టించేశాడు ద‌ర్శ‌కుడు.

ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులు అయితే… స్క్రిప్టు ప‌క‌డ్బందీగా ఉంటుంది. బ‌ల‌మైన కాన్‌ఫ్లిక్ట్ రాసుకొంటారు. అయితే…ఈ రెండు విష‌యాల్లోనూ ప‌ర‌శురామ్ చేతులెత్తేశాడు. డైలాగులు అక్క‌డ‌క్క‌డ మెరుస్తాయి. అయితే.. ఓ సినిమాని హిట్ చేయ‌డానికి ఈ ఎఫెక్ట్ స‌రిపోదు. విజువ‌ల్‌గా సినిమా బాగుంది. రిచ్‌నెస్ క‌నిపించింది. పాట‌లెందుకో ఎక్క‌లేదు. ‘గీత గోవిందం’లోని పాట‌లు ఇన్‌స్టెంట్ హిట్స్ అయ్యాయి. గోపీసుంద‌ర్ మ్యాజిక్ ఈ సినిమాలో ప‌ని చేయ‌లేదు. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ట్రైల‌ర్‌లోనూ బ‌లంగా వాడారు. ”సిగ‌రెట్లు ఉన్నాయ‌ని కాల్చేసి, మందు ఉంది క‌దా అని తాగేసి, లిఫ్టులున్నాయి అని క‌దా అని ఎక్కేస్తే ఆరోగ్యం పాడైపోతుంది” అని. కాంబినేష‌న్లు కుదిరాయి క‌దా అని క‌థ లేకుండా, కాన్‌ఫ్లిక్ట్ లేకుండా సినిమాలు తీసేసినా అంతే అనారోగ్యం. తీసిన వాళ్ల‌కూ.. చూసిన వాళ్ల‌కూ!! కామ‌న్ మాన్ గురించి చెప్ప‌డానికి హీరోయిన్ ఓ పుస్త‌కం రాయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాలే ఈ సినిమా.

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News