Sarkaru Vaari Paata Review: సర్కారు వారి పాట మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Sarkaru Vaari Paata Review: మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన 'సర్కారువారి పాట'ఎలా ఉందంటే?

Update: 2022-05-12 06:36 GMT

Sarkaru Vaari Paata Review: సర్కారు వారి పాట మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Sarkaru Vaari Paata Review:

చిత్రం: సర్కారు వారి పాట

నటీనటులు: మహేష్ బాబు కీర్తి సురేష్, సముతిరఖని, నదియా, సౌమ్య మీనన్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: తమన్

సినిమాటోగ్రఫీ: ఆర్ మధి

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట

దర్శకత్వం: పరశురామ్

బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 12/05/2022

"సరిలేరు నీకెవ్వరు" సినిమా తో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు "సర్కారు వారి పాట" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. "గీత గోవిందం" సినిమా తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. "మహానటి" బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ముందు నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మహేష్ బాబు కూతురు సితార కనిపించిన "పెన్నీ" పాట వల్ల కూడా సినిమాకి బాగానే హైప్ వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా మే 12, 2020 n థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

మహేష్ (మహేష్ బాబు) అమెరికాలోని లోన్ రికవరీ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటాడు. కళావతి (కీర్తి సురేష్) మహేష్ నుంచి ఒక లోన్ తీసుకుంటుంది కానీ తిరిగి కట్ట లేక పోతుంది. దీంతో విసుగు చెందిన మహేష్ ఆమెకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు కళావతి తన పవర్ఫుల్ తండ్రి రాజేంద్రనాథ్ (సముతిరఖాని) ను రంగంలోకి దింపుతుంది. ఇక చేసేది లేక మహేష్ తన డబ్బును తిరిగి తీసుకోవడం కోసం ఇండియాకి వస్తాడు. కానీ ఇండియా వచ్చాకే మహేష్ కి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆ ప్రాబ్లంమ్స్ ఏంటి? అసలు ఈ రాజేంద్రనాధ్ ఎవరు? మహేష్ ఇబ్బందులను ఎలా ఎదుర్కున్నాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

మహేష్ బాబు అద్భుతమైన నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ మరియు యాక్షన్ అవతార్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. మహేష్ బాబు ఈ సినిమాలో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. అలానే తన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. అయినప్పటికీ తన పాత్రలో ఒదిగిపోయి మహేష్ బాబు చాలా బాగా నటించారు. కీర్తి సురేష్ కి కూడా ఈ సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. మహేష్ బాబుతో కీర్తి సురేష్ కెమిస్ట్రీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. తన పాత్రకి కొంచెం నెగటివ్ తెచ్చుకున్నప్పటికీ కీర్తి సురేష్ చాలా బాగా నటించింది. విలన్ పాత్రకి సముతిరఖని చాలా బాగా సెట్ అయ్యారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

కథ ప్రకారం చూసుకుంటే సినిమాలో చెప్పుకోదగ్గ విభిన్నమైన కథ ఏమీ లేదు. ఇది ఒక మామూలు కమర్షియల్ యాక్షన్ సినిమా. ఒక దర్శకుడిగా పరశురామ్ ఈ సినిమా కోసం చాలా సినిమాటిక్ లిబర్టీస్ ను తీసుకున్నట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాకి నిర్మాణ విలువలు అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నిర్మాతలు బడ్జెట్ పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు. తమన్ సంగీతం కూడా ఈ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. పాటలు మాత్రమే కాక తమన్ నేపధ్య సంగీతంతో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. మధి అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి.

బలాలు:

ప్రథమార్ధంలో వినోదం

నటీనటులు

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ

బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యం

బలహీనతలు:

లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు

స్క్రీన్ ప్లే

చివరి మాట:

బ్యాంక్ రుణాలు చెల్లింపుల విషయంలో మధ్యతరగతి వాళ్లు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉంటాయి. కథ కూడా పల్చగానే అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ తో బాగానే సాగి పోతుంది కానీ సెకండాఫ్ ని మాత్రం కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మీకు కూడా కొంచెం డ్రమాటిక్ గా ఎమోషన్స్ ని జోడించి తీసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా కమర్షియల్ సినిమా టెంప్లేట్ లోనే సాగుతుంది. చివరగా సర్కారు వారి పాట సినిమా కేవలం మహేష్ బాబు నటన మరియు ఎంటర్టైన్మెంట్ తో ముందుకు సాగే ఒక యాక్షన్ డ్రామా.

బాటమ్ లైన్:

"సర్కారు వారి పాట" తో ఆట ఆడించిన మహేష్ బాబు.

Tags:    

Similar News