saaho review: ఇది అభిమానుల సాహో
బాహుబలి లాంటి భారీస్థాయిలో వచ్చిన సినిమా తర్వాత.. ఆ ఇమేజ్ కాపాడుకునే సినిమా కావాలి. ఆ తాపత్రయంతోనే.. ప్రభాస్ సాహో సినిమాని ఎన్నుకున్నారు. అదేస్థాయిలో సాహో కోసం శ్రమించారు. ఒక్క సినిమా చేసిన దర్శకుడు సుజిత్ ప్రతిభను నమ్మి భారత సినీచరిత్రలోనే ఇప్పటివరకూ లేనంత భారీ బడ్జెట్ తో సాహో రూపొందించారు.
బాహుబలి లాంటి భారీస్థాయిలో వచ్చిన సినిమా తర్వాత.. ఆ ఇమేజ్ కాపాడుకునే సినిమా కావాలి. ఆ తాపత్రయంతోనే.. ప్రభాస్ సాహో సినిమాని ఎన్నుకున్నారు. అదేస్థాయిలో సాహో కోసం శ్రమించారు. ఒక్క సినిమా చేసిన దర్శకుడు సుజిత్ ప్రతిభను నమ్మి భారత సినీచరిత్రలోనే ఇప్పటివరకూ లేనంత భారీ బడ్జెట్ తో సాహో రూపొందించారు. ప్రీ రిలీజులోనే రికార్డులు బద్దలుకొట్టింది సాహో. యూనిట్ కూడా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని చెప్పింది. దాంతో బాహుబలి ని మించి సాహో కి హైప్ వచ్చింది. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? ప్రేక్షకులని సినిమా మెప్పించిందా? చూద్దాం.
కథ ఇదే!
వాజీ అనే సిటీ కేంద్రంగా నడిచే ప్రపంచంలోనే కరుడుకట్టిన గ్యాంగ్ స్టర్ ల మధ్య గొడవతో సినిమా మొదలవుతుంది. తన అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటున్న పృథ్వీ రాజ్ (టిను ఆనంద్) కు.. రాయ్ గ్రూప్ పేరుతో క్రైమ్ సిండికేట్‌ను నడిపిస్తున్న రాయ్ (జాకీ ష్రాఫ్)… కు మధ్య గొడవలు జరుగుతుంటాయి.
ఇలా వుండగా..రాయ్ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్ పేలిపోతుంది. సరిగ్గా ఈ సమయంలోనే రాయ్ కొడుకు విశ్వక్ (అరుణ్ విజయ్) గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యంలోకి వారసుడిగా వచ్చి ఆ రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని ఛాలెంజి చేస్తాడు.
ఇదిలా వుండగా.. ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్ కవర్ కాప్‌గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) వస్తాడు. క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్ (శ్రద్ధ కపూర్) అతనికి సహాయంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని చంపిందెవరు? రూ.రెండు లక్షల కోట్లు గ్యాంగ్ స్టర్స్ కి దక్కాయా? అశోక్ చక్రవర్తి - అమృతా నాయర్ ల ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది? ఇవన్నీ వెండితెర మీద చూడాల్సిందే!
ఎలావుందంటే..
సింపుల్ గా ఇది టాలీవుడ్ పూతపూసిన హాలీవుడ్ సినిమా. అంటే హాలీవుడ్ కథనానికి మన నేటివిటీని అద్దిన సినిమా. కథనం ప్రధానంగా సాగే చిత్రం. యాక్షన్ సన్నివేశాల చుట్టూ ఆ కథనాన్ని అల్లారు.
అద్భుతమైన యాక్షన్ దృశ్యాలు మెప్పిస్తాయి. అయితే.. సినిమాలో ప్రభాస్..వెన్నెల కిషోర్ లాంటివారిని మినహాయిస్తే మిగిలినవారు హిందీ వారు..ఇతర భాషల వారు కావడంతో కొద్దిగా డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది.
ఇక ముందునుంచీ ప్రచారం జరిగినట్టు సినిమా చాలా రిచ్ గా.. కనిపిస్తుంది. కథనం ఆయువుపట్టుగా సినిమా నడిపించే దర్శకుడు సుజీత్ అక్కడక్కడ తడబడ్డాడని చెప్పక తప్పదు.
ఎవరెలా చేశారు..
ఇది ప్రభాస్ సినిమా. ప్రభాస్ మాత్రమే చేయాల్సిన సినిమా. ఈ రెండు వాక్యాలూ చాలు సినిమాలో ప్రాధాన్యతలు చెప్పడానికి. అవును..ప్రభాస్ నటుడిగా మరో పది మెట్లు పైకి ఎక్కేశారు. లవర్ బాయ్..యక్షన్ గై.. ఇలా అన్ని షేడ్స్ నీ చాలా సులువుగా చేసేశారు. సినిమా మొత్తం ప్రభాసే కనిపిస్తాడు. శ్రద్దా కపూర్ బాగానే చేసింది. మిగిలిన వారివి ఆయారాం గయారాం పాత్రలు..
టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో వుంది. హాలీవుడ్ దర్శకుల యాక్షన్ సన్నివేశాలు సూపర్ అనాల్సిందే. ఇక సంగీతం ఫర్వాలేదు. ఫొటోగ్రఫీ బావుంది. సుజీత్ దర్శకత్వం గురించి ఒకటే మాట.. కెరీర్ రెండో సినిమా కోట్లాదిరూపాయల బడ్జెట్ భారీతనాన్ని మోస్తున్న ఒత్తిడిలో కూడా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు.
చివరగా..సాహో ప్రభాస్ అభిమానుల సినిమా. ప్రపంచస్థాయి సినిమా. తెలుగులో బాలీవుడ్ డబ్బింగ్ సినిమా లేదా హాలీవుడ్ డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి ఎవరికైనా కలిగితే అది వారి తప్పుకాదు.