Pelli SandaD Movie Review: "పెళ్లి సందD" సినిమా రివ్యూ
Pelli SandaD Movie Review: "పెళ్లి సందD" సినిమా రివ్యూ
Pelli SandaD Movie Review: హీరో శ్రీకాంత్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన రోషన్, నూతన నటి శ్రీలీల జంటగా నటించిన పెళ్లి సందD చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించి సూపర్ హిట్ చిత్రమైన "పెళ్ళిసందడి" సినిమాకి ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న లవ్ స్టొరీలను కథగా ఎంచుకొని కొత్తగా తెరక్కించిన ఈ పెళ్లి సందD సినిమా ఎలా ఉందో చూసేద్దాం..
చిత్రం: పెళ్లి సందD
నటీనటులు: రోషన్ మేక, శ్రీలీల, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు
సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
నిర్మాత: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ
దర్శకత్వం: గౌరీ రోనంకి
బ్యానర్: ఆర్కా మీడియా, ఆర్కే ఫిలిం అసోసియేట్స్
విడుదల తేది: 15/10/2021
కథ:
వశిష్ట (రోషన్) అనే కుర్రాడు ఒక మంచి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక సందర్భంలో తన బ్రదర్ పెళ్ళిలో సహస్ర (శ్రీ లీల)అనే అమ్మాయిని చూసి వశిష్ట ప్రేమలోపడతాడు. ఆమెకు కూడా వశిష్టను చూసి అతడు నచ్చి ప్రేమిస్తోంది. అలా సరదాగా మొదలైన వీరి ప్రేమకథలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వీరి ప్రేమకు అసలు అడ్డు ఎవరు? చివరకు సహస్ర - వశిష్ట తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశారో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటులు:
శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ తన డైలాగ్ డెలివరీతో పాటు డాన్స్ తో తన పాత్రకు తగినట్లుగా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన శ్రీలీల అందంగా కనిపిస్తూనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన రావు రమేష్, రఘుబాబు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ తో పాటు మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. గౌరీ రోనంకి పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. సినిమా ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలను సునీల్ కుమార్ అందంగా చూపించారు. సంగీత దర్శకుడు కీరవాణి అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
- రోషన్ యాక్టింగ్
- రావు రమేష్, రఘుబాబు కామెడీ
మైనస్ పాయింట్స్ :
- కథ
- స్క్రీన్ ప్లే
- స్లో నేరేషన్
బాటమ్ లైన్: సందడి లేని పెళ్ళిగా మిగిలిపోయిన "పెళ్లి సందD"