RDX love : రివ్యూ...

సినిమా ద్వారా దర్శకడు ఏదైనా మెసేజ్ ఇద్దమనుకున్నాడా లేకా యూత్ ని టార్గెట్ చేసి సినిమా చేసాడా? అన్న సందేహం కలుగక మానదు. చివరగా సినిమాని చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఈ టైటిల్ కి ఈ సినిమాకి సంబంధం ఏంటి అన్న అనుమానం కలగక మానదు..

Update: 2019-10-11 09:46 GMT

RX 100 సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని మొత్తం తన వైపు తిప్పుకుంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్... ఆ తర్వాత చాలా సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలు ఎంపీక చేసుకోవడం మొదలు పెట్టింది. ఈ నేపధ్యంలో RDX love సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో మన రివ్యూలో చూద్దాం..

కథ :- 

జనాభా తక్కువగా ఉండడంతో చంద్రన్న పేట అనే గ్రామం అభివృద్దికి దూరంగా ఉంటూ వస్తుంది. అదే గ్రామంలో వంతెన లేకపోవడంతో వరుసగా ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. దీనిని ప్రభుత్వం కూడా పట్టించుకోదు. చంద్రన్న పేట రివర్ బ్రిడ్జ్ నర్సయ్య (నరేష్) పోరాటం చేస్తుంటాడు. ఇది ఇలా ఉంటే విజయవాడలో అలివేలు అనే అమ్మాయి తన స్నేహితుల‌తో క‌లిసి ప్రభుత్వ ప‌థకాల‌ను అమ‌లును స‌రిగా జ‌రిగేలా ప్రచారం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఎయిడ్స్ బారిన పడకుండా కండోమ్ వాడాలని ప్రచారం చేస్తున్న నేపధ్యంలో హీరోతో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది.ఈ క్రమంలో అలివేలుపై ఓ టైం లో ఎటాక్ జరుగుతుంది. దీనితో అలివేలు తన ఊరు చంద్రన్న పేటకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకి ఈ ఎటాక్ చేసింది ఎవరు ? ఆ గ్రామానికి అలివేలుకు సంబంధం ఏంటి ? చివరికి ఆ ఊరు పరిష్కారం అయ్యిందా లేదా అన్నది తెరపైన చూడాలి.

ఎలా ఉందంటే ?

సినిమా మొదలు నుండే పాయల్ రాజ్ పుత్ నే చిత్ర యూనిట్ హైలేట్ గా చేసుకుంటూ వస్తుంది. చిత్ర టిజర్ లో ఆమె దగ్గరి నుండి ఏదైతే ఆశించారో అదే పెట్టారు కూడా... ఇక చిత్ర ట్రైలర్ ని మాత్రం టిజర్ కి భిన్నంగా ఉంచారు. ఇందులో ఎదో ఉందన్న ఆసక్తిని ప్రేక్షకులలో కలగచేసారు. ఇక దియేటర్ లోకి వచ్చినా ప్రేక్షకుడికి టిజర్ లో చూసిన సన్నివేశాలే ఎక్కువగా ప్రత్యేక్షం అవుతూ ఉంటాయి. ఊరుకోసం తాపత్రయ పడే ఓ అమ్మాయి చేసే పోరాటం లాగా ఎక్కడ కూడా మనకు అనిపించదు. సినిమా మొదటి భాగంలో రొమాంటిక్ సీన్స్ , డబుల్ మినింగ్ తో కుడుకున్నా సంభాషణలు బాగానే పెట్టారు. ఇక హీరో హీరోయిన్ వచ్చారు కదా సినిమా మెయిన్ ట్రాక్ ఎక్కుతుందా అంటే అది లేదు. లవ్ ట్రాక్ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టిన దర్శకుడు మెయిన్ కథని గాల్లోకి వదిలేశాడు. సినిమా ద్వారా దర్శకడు ఏదైనా మెసేజ్ ఇద్దమనుకున్నాడా లేకా యూత్ ని టార్గెట్ చేసి సినిమా చేసాడా? అన్న సందేహం కలుగక మానదు. చివరగా సినిమాని చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఈ టైటిల్ కి ఈ సినిమాకి సంబంధం ఏంటి అన్న అనుమానం కలగక మానదు..

నటినటులు :-

సినిమా మొత్తాని తన భుజం మీదా వేసుకొని నడిపించింది పాయల్... మంచి నటనని కనబరించింది. ఇక హీరోగా తేజ‌స్ కంచ‌ర్ల ఒకే అనిపించాడు.ఇక సినిమాలో కూడా చెప్పుకోడానికి పెద్ద పాత్రలు అయితే లేవనే చెప్పాలి.

సాంకేతిక వర్గం : -

ఇక సాంకేతికవర్గం విషయానికి వస్తే రధన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. అక్కడక్కడ నేపధ్య సంగీతం పర్వాలేదు అని అనిపిస్తుంది. రాంప్రసాద్ కెమరా పనితనం సినిమాకి ఓ బలం అనే చెప్పాలి. పల్లెటూరు సన్నివేశాలని బాగా చిత్రీకరించారు. ప్రవీణ్ పూడి తన కత్తెరకి చాలా పని చెప్పాలి అనిపిస్తుంది. సి కళ్యాణ్ నిర్మాణ విలువలు సినిమాని చాలా గ్రాండ్ గా చూపించాయి. ఫైనల్ గా దర్శకుడు యూత్ ని టార్గెట్ చేసి దియేటర్ వైపు రప్పించుకునే ప్రయత్నం అయితే చేసాడు కానీ సినిమా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడనే చెప్పాలి.

చివరగా ఓ మాట :-  కథలో బలం లేనప్పుడు ప్రేక్షకుడికి ఎన్ని ఉన్నా వేస్టే..

గమనిక : ఈ సినిమా రివ్యూ ఒక్క ప్రేక్షకుడికి సంబంధించినది మాత్రమే పూర్తి సినిమాని దియేటర్ కి వెళ్లి చూడగలరు.  

Tags:    

Similar News