అశ్వథ్థామ రివ్యూ
లవర్ బాయ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో నాగశౌర్య.. ఆ తర్వాత అదే తరహ పాత్రలతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
లవర్ బాయ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో నాగశౌర్య.. ఆ తర్వాత అదే తరహ పాత్రలతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. వరుస ప్లాపులు వెంటాడడంతో తనే రైటర్ గా మారి ఛలో కథను తెరకెక్కించి మంచి హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నర్తనశాల నిరాశపరిచింది. ఇక మళ్ళీ తానే ఓ థ్రిల్లర్ కథను రాసుకొని 'అశ్వథ్థామ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా నాగశౌర్యకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అన్నది మన రివ్యూలో చూద్దాం..
కథ:
అన్న చెల్లులు అయిన గణ( నాగశౌర్య) ప్రియ ( సర్గున్ కౌర్ ) కి ఒకరంటే ఒకరికి ప్రాణం .. ప్రియకి ఎంగేజ్మెంట్ అయి ఆ పెళ్లి వాతావరణంలో ఇల్లంతా ఆనందంగా ఉంటున్న సమయంలో ప్రియ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇది చూసిన అన్నయ్య గణ ఆమెను కాపాడి నిజం తెలుసుకోగా ఆమె గర్బవతి అని తెలుస్తోంది. ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేకుండా ఆమెకి గర్భం ఎలా వచ్చింది అని తెలుసుకునే క్రమంలో ఇలాగే చాలా మంది అమ్మాయిలు భాదపడుతున్నారన్న విషయాన్నీ గణ కనుకుంటాడు. ఇంతకి దీని వెనుక ఉన్నది ఎవరు ? వారిని గణ ఎలా కనిపెట్టాడు. ఫైనల్ గా ఈ సమస్యకి సమస్య దొరికిందా ? ఇందులో మేహరీన్ పాత్ర ఏంటి అన్నది తెరపైన చూడాలి.
ఎలా ఉందంటే?
సినిమా ట్రైలర్ తో సినిమాపైన బాగా అంచనాలు పెరిగిపోయాయి. సమాజంలో జరిగే ఓ ఇన్సిడెంట్ ని యాక్షన్ నేపధ్యంలో అశ్వథ్థామ సినిమాని తెరకెక్కించారు. కుటుంబ నేపధ్యంలో ఉన్న సన్నివేశాలతో సినిమాని మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత సాదాసీదా సన్నివేశాలతో కథని నడిపించాడు. ఇందులో లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు కూడా .. ఇక చెల్లలకి జరిగిన అన్యాయయనికి కారకులైన వారిని కనిపెట్టే క్రమంలో ప్రాసెస్ కాస్త క్యూరియాసిటీని పెంచుతుంది. అందులో భాగంగా జరిగే సన్నివేశాలు ఉత్కంఠని కలగజేస్తాయి. ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం రెండవ భాగంపై భారీ అంచనాలను కలగజేస్తాయి. కానీ రెండవ భాగం మొదటిలోనే విలన్ ని రివిల్ చేయడం ఆసక్తి తగ్గుతుంది. ఇక సైకోగా అతను ఎందుకు ఇలా మారాడు అన్న ఇతివృత్తం బాగానే ఆకట్టుకుంటుంది. ఇక పోరాట సన్నివేశాలు రొటీన్ గానే ఉండడం ప్రేక్షకులని నిరాశకి గురిచేస్తుంది.
ఎవరెవరు ఎలా చేశారంటే?
ఇప్పటివరకు లవర్ బాయ్ గా మెప్పించిన నాగశౌర్య ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ సన్నివేశాలలో బాగా నటించాడు. ఇలాంటి పాత్రలు కూడా నాగశౌర్య చేయగలడని పప్రూవ్ చేసుకున్నాడు. ఇక కథ రచయితగా కూడా మెప్పించి సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. హీరోయిన్ గా మేహరీన్ కి పాత్ర పరంగా పెద్ద స్కోప్ లేనప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక నాగశౌర్య చెల్లెలుగా సర్గున్ కౌర్ నటన బాగుంది. ప్రిన్స్,పోసాని తదితరులు పాత్రల మేరకు పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక వర్గం:
సినిమాకి సినిమాటోగ్రఫీ అద్భుతంగా నిలిచింది. ఐరా క్రియేషన్స్ అందించిన నిర్మాణ విలువల సినిమా స్థాయిని పెంచాయి. శ్రీచరణ్ అందించిన పాటలు, జిబ్రాన్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకున్నాయి.
చివరగా: ఆడవాళ్ళని గౌరవించాలి అన్న మెసేజ్ ని ఈ సినిమా ప్రేక్షకుడికి ఇస్తంది. థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతారు.