Mercy Killing 2024 Review: ఆర్టికల్ 21తో న్యాయం జరిగిందా? మెర్సీ కిల్లింగ్ మూవీ మెప్పించిందా?

Mercy Killing 2024 Review: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా "మెర్సి కిల్లింగ్". ఈ సినిమాలో సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించారు.

Update: 2024-04-12 13:56 GMT

Mercy Killing 2024 Review: ఆర్టికల్ 21తో న్యాయం జరిగిందా? మెర్సీ కిల్లింగ్ మూవీ మెప్పించిందా?

చిత్రం: మెర్సీ కిల్లింగ్ ‌;

నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక తదితరులు‌;

బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్‌;

డైరెక్టర్: వెంకటరమణ ఎస్‌;

నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల‌;

సమర్పణ: శ్రీమతి వేదుల బాల కామేశ్వరి;

సినిమాటోగ్రఫీ: అమర్.జి‌;

సంగీతం: ఎం.ఎల్.రాజ‌;

ఎడిటర్: కపిల్ బల్ల‌;

విడుదల: 12-04-2024

Mercy Killing 2024 Review: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా "మెర్సి కిల్లింగ్". ఈ సినిమాలో సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా.. ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన మెర్సీ కిల్లింగ్.. స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం చేయాలనే సీన్‌తో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

చిన్న వయసులోనే తన తల్లితండ్రుల నుంచి వేరుగా అనాథగా బతుకుతున్న స్వేచ్ఛ (హారిక).. తన పేరెంట్స్ ఎవరు అనే సందిగ్ధంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో తన తల్లితండ్రులు ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో స్వేచ్ఛ మహేష్ (పార్వతీశం), భారతి (ఐశ్వర్య) లను కలుస్తుంది. మహేష్, భారతి ఎవరు? స్వేచ్ఛకు వారు ఎలా హెల్ప్ అయ్యారు? ఈ క్రమంలో రామకృష్ణమ్ రాజు (సాయి కుమార్) స్వేచ్చకు ఎలా ఎదురవుతాడు? స్వేచ్చకు రామకృష్ణమ్ రాజు ఏమవుతాడు? చివరికి స్వేచ్ఛ తన పేరెంట్స్ ను కలిసిందా? జడ్జి (సూర్య) స్వేచ్చకు ఇచ్చిన ఐడియా ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే మెర్సీ కిల్లింగ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒదిగిపోయింది. అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సాయి కుమార్‌కు ఈ సినిమా మరో ప్రస్థానం అని చెప్పవచ్చు. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. బసవరాజు పాత్రలో రామరాజు బాగా నటించాడు. అలాగే జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు.

స్వేచ్ఛ, రామకృష్ణమ్ రాజు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యాయి. దర్శకుడు వెంకట రమణ తీసుకున్న కథ, కథనాలు సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఇలాంటి సబ్జెక్ట్స్ ను డీల్ చెయ్యడం కొందరికే సాధ్యం. దర్శకుడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మెర్సీ కిల్లింగ్ సినిమాను తెరకెక్కించారు.

జి.అమర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, సాంగ్స్, కాకినాడలోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా, సహజంగా చూపించారు. ఎం.ఎల్.రాజా పాటలు, నేపధ్య సంగీతం బాగా కుదిరాయి. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా మెర్సీ కిల్లింగ్ సినిమాను నిర్మించారు. శ్రీమతి వేదుల బాల కామేశ్వరి ఐడియాస్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ప్రొడక్షన్ ప్లానింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లోను తన సూచనలు సినిమా మరో మెట్టు ఎక్కడానికి దోహద పడింది.

చివరిగా: ఎమోషనల్ కథ, కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన మెర్సి కిల్లింగ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

Tags:    

Similar News