పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ఆ సినిమా దర్శకుడినే హీరోగా పెట్టి నూతన దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 'మీకు మాత్రమే చెప్తా' అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం..
కథ:
రాకేశ్ (తరుణ్ భాస్కర్) ఓ మీడియా ఛానల్ లో యాంకర్ గా పని చేస్తాడు. అతను డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్)ని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోడానికి ఇంట్లో అందరిని ఒప్పిస్తాడు. సరిగ్గా పెళ్ళికి ఒకరోజు ముందు రాకేశ్ సంబంధించిన ఓ వీడియో నెట్లో ఉంటుంది. అది రాకేశ్ పెళ్లి చేసుకునే సెప్టి చూస్తే పెళ్లి ఆగిపోతుంది. దీనితో ఆ వీడియోని డిలిట్ చేసేందుకు రాకేశ్ అతని ఫ్రెండ్ అభినవ్ గోమఠంతో కలిసి ప్రయాణం మొదలు పెడుతాడు. ఇక్కడ మొదలైన ప్రయాణంలో ఎం జరిగింది. ఇంతకి ఆ వీడియోలో ఏముంది. ఇంతకి దానిని పెట్టింది ఎవరు అన్నది తెరపైన చూడాలి.
ఎలా ఉంది అంటే ?
మనకి సంబంధించిన ఓ వీడియోని నెట్లో పెడితే ఎంత కంగారు పడతాం. ఇదే పాయింట్ ని తెరపైన చూపించాడు దర్శకుడు. మొదటి భాగాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కథను చెబుతూనే దానికీ ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ గా జోడించాడు. ఇక తరుణ్ భాస్కర్ ని హైలెట్ చేయకుండా కథలో ఇతను ఓ భాగమే అన్నట్టుగా చూపించాడు దర్శకుడు.. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు బాగా పేలాయి. ఇక రెండవ భాగానికి వచ్చేసరికి కథను కొంచెం ల్యాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఉహించిన సన్నివేశాలే ఉండడంతో సినిమాపైన ఆసక్తి తగ్గుతుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. సినిమా నిడివి తక్కువగా ఉండటం.. కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు
నటినటులు :
తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి విజయ్ సినిమా తీస్తున్నాడు అంటే అందరు ఆశ్చర్యపోయారు. కానీ అతనిలో ఇంతమంచి నటుడు ఉన్న విషయం ఈ సినిమా చూసిన వారికీ తెలుస్తుంది. చాలా సహజంగా నటించాడు. నవ్వించాడు. ఇక అభినవ్ గోమఠం కామెడి సినిమాకి చాలా ప్లస్ అయింది. కొన్ని కొన్ని సన్నివేశాలలో అతని కామెడికి పొట్టలు చెక్కలు అయ్యేలా నవ్వడం ఖాయం.. అనసూయది చిన్న పాత్రే. వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అవంతికా మిశ్రా తదితరులు తమ పాత్రల మేరకు ఒకే అనిపించారు.
సాంకేతిక వర్గం :
ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే నిర్మాణ విలువలు ఆశించిన స్థాయిలో లేవు. ఆర్ట్ డైరెక్షన్ మాత్రం బాగుంది. శివకుమార్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే సినిమాని ఎంజాయ్ చేస్తారు.
చివరగా ఓ మాట: "ఫుల్ టైంపాస్ సినిమా"
గమనిక : సినిమా రివ్యూ ఒక ప్రేక్షకుడికి మాత్రమే సంబంధించినది. పూర్తి సినిమాని ధియేటర్ కి వెళ్లి చూడగలరు .