PS-1 Review: 'పొన్నియిన్‌ సెల్వన్‌' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

PS-1 Review: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Update: 2022-09-30 05:33 GMT

PS-1 Review: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: పొన్నియిన్ సెల్వన్

నటీనటులు: చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ఆర్ శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ప్రకాష్ రాజ్, అశ్విన్ కాకుమాను, నాజర్, తదితరులు

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

నిర్మాత: మణిరత్నం, సుభస్కరన్ అల్లిరాజా

దర్శకత్వం: మణి రత్నం

బ్యానర్లు: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్

విడుదల తేది: 30/09/2022

తమిళ ప్రేక్షకులందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా "పొన్నియిన్ సెల్వన్". ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పౌరాణిక సినిమాను కోలీవుడ్ "బాహుబలి" అని అభిమానులు కొనియాడుతున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ కాస్ట్ ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ ఇవాళ సెప్టెంబర్ 30 న విడుదల అయ్యింది. మరి ఈ సినిమా నిజంగానే "బాహుబలి" రేంజి లో ప్రేక్షకులను అలరించిందో లేదో చూసేద్దామా..

కథ:

ఫేమస్ తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి నవల "పొన్నియిన్ సెల్వన్" ఆధారంగా ఈ సినిమా వచ్చింది. "పొన్నియిన్ సెల్వన్" వెయ్యేళ్ళ క్రితం ఉన్న చోళ రాజ్యం యొక్క గొప్ప తనాన్ని చెప్తుంది. అయితే ఈ రాజ్యం ని ఆక్రమించుకుందాం అని అనుకున్నది ఎవరు ? ఆదిత్య కరికాలుడు (విక్రం) అనే రాజు ఎలా కాపాడుకున్నాడు ఈ రాజ్యాన్ని ? అసలు కుండవై (త్రిష) ఎవరు ? అసలు నందిని (ఐశ్వర్యారాయ్) అనే పాత్ర ఈ మొత్తం కథకి ఎలా కనెక్ట్ అయ్యి ఉంది ? అరున్మోజి వర్మ (జయం రవి) యొక్క ప్రాముఖ్యత ఏంటి ? కరికాలుడు మిత్రుడు వందేదేవుడు (కార్తీ) కరికాలుడు కోసం చోళ రాజ్యం కోసం ఏం చేశాడు ? ఇవన్ని తెలియాలి అంటే "పొన్నియిన్ సెల్వన్" చూడాల్సిందే.

నటీనటులు:

అందరూ అనుభవం ఉన్న నటీనటులు ఉండడం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. పైగా చాలా వరకు యాక్టర్లు తెలుగు లో కూడా సుపరిచితులు కావడం వల్ల తెలుగు ప్రేక్షకులలో కూడా సినిమా మంచి బజ్ అందుకుంది. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించారు. తన క్యారెక్టర్రైజేషన్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఐశ్వర్య రాయ్ నటన ఈ సినిమాకి ఊపిరి పోసింది అని చెప్పచ్చు. త్రిష కూడా తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించింది. జయం రవి, కార్తీ లు కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. కార్తీ నటనకు మాత్రం ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి స్కోప్ దొరికింది. ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ఆర్ శరత్ కుమార్ ల స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. వెంకట్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, అశ్విన్ కాకుమాను, నాజర్ లు కూడా సినిమాకి బాగానే ప్లస్ అయ్యారు. మిగతా నటినటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

తమిళ్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అని కొందరు చెబుతున్నారు. దానికి కారణం సినిమా ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్. ఈ మధ్య కాలంలో తమిళ్ లో ఇలాంటి అదిరిపోయే విజువల్స్ ఉన్న సినిమా రాలేదు అనే చెప్పుకోవాలి. ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు మణి రత్నం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా తెరకెక్కించారు. మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం మాత్రమే కాకుండా సినిమా టేకింగ్ విషయంలో అది నిరూపిస్తూనే ఉన్నారని చెప్పాలి. తను చెప్పాలి అనుకున్న కథ ను చాలా చక్కగా వెండి తెరపై చూపిస్తూ తన స్టైల్ మ్యాజిక్ ను కూడా క్రియేట్ చేసారు మణి రత్నం. కానీ కథనం విషయంలో మణిరత్నం ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాణ విలువలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఏ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా సెట్ అయింది, కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే కేవలం నేపధ్య సంగీతం వల్లే రక్తికట్టాయి అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాకి అదిరిపోయే విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. రన్ టైమ్ ఇంకొంచెం తగ్గించి ఉంటే బావుండేది.

బలాలు:

నటీనటులు

నిర్మాణ విలువలు

సంగీతం

బలహీనతలు:

స్లో సన్నివేశాలు

రన్ టైం

చివరి మాట:

నవల ఆధారంగా రూపొదించిన ఈ "పొన్నియిన్ సెల్వన్" ఆ నవల చదివిన వారిని మాత్రం బాగా మెప్పిస్తుంది. కానీ చిత్రం నిడివి అలాగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకి ఓపికని పరిక్షిస్తాయి. క్వాలిటీ పరంగా బాగుండి ఎక్కడా హై పాయింట్స్ లేని ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం "పొన్నియిన్ సెల్వన్" మెప్పిస్తుంది.

బాటమ్ లైన్:

"పొన్నియిన్ సెల్వన్" మరొక బాహుబలి కాకపోయినా బాగానే ఆకట్టుకునే కథ.

Tags:    

Similar News