Simbaa Movie Review: జగపతిబాబు, అనసూయ నటించిన 'సింబా' ఎలా ఉంది.. రివ్యూ మీకోసం..!

Simbaa Movie Review: టాలీవుడ్‌లో ఎంతోమంది యువ దర్శకులు తమకంటూ ఓ ప్రత్యేక శైలిలో సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Update: 2024-08-09 04:52 GMT

చిత్రం: సింబా:

నటీనటులు: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, శ్రీనాథ్ మాగంటి, క‌బీర్‌సింగ్‌ తదితరులు:

దర్శకత్వం: మురళీ మనోహర్‌రెడ్డి:

విడుదల: 09-08-2024

Simbaa Movie Review: టాలీవుడ్‌లో ఎంతోమంది యువ దర్శకులు తమకంటూ ఓ ప్రత్యేక శైలిలో సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి కొద్దిమంది డైరెక్టర్లలో సంపత్ నంది ఒకరు. ఈ యువ డైరెక్టర్ తక్కువ బడ్జెట్‌లో తన అభిరుచితోపాటు జనాల నాడిని పట్టుకుంటూ సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నాడు. ఓవైపు భారీ సినిమాలను డైరెక్ట్ చేస్తూనే.. మ‌రోవైపు పేప‌ర్ బాయ్‌, గాలిప‌టంలాంటి చిన్న సినిమాలకు స్టోరీస్ అందిస్తున్నాడు. ఇలాంటి కోవలోకే వచ్చిన సినిమా 'సింబా'. సంప‌త్ నంది ఈ సినిమాకి స్టోరీని అందించగా.. ఆయన దగ్గరే పనిచేస్తోన్న ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబులతో పలువరు కీలక పాత్రలు పోషించారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

క‌థేంటంటే?

హైద‌రాబాద్ సిటీలో ఓ హ‌త్య జరుగుతుంది. ఈ క్రమంలో పోలీసులు పరిశోధనలో ఉండగానే.. మ‌రో హ‌త్యతో గందరగోళం నెలకొంటుంది. ఈ వ‌రుస‌ మర్డర్ల వెన‌క స్కూల్ టీచ‌ర్ అనుముల అక్షిక (అన‌సూయ‌), ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి)ల హస్తం ఉందని పోలీసులు గుర్తించి, వీరిని అరెస్ట్ చేసి, జైలుకు త‌ర‌లిస్తారు. ఈ క్రమంలో అక్షిక, ఫాజిల్‌లను అంతం చేయ‌డానికి స్కెచ్ గీసిన ఒకరు పోలీసుల ముందే మర్దర్ అవుతారు. పోలీసుల విచార‌ణ‌లో తామకేం తెలియదని చెబుతుంటారు. అయితే, మర్డర్‌ అయిన వాళ్లంతా పారిశ్రామిక వేత్త పార్థ (క‌బీర్‌సింగ్‌) వర్గీయులే కావడం గమనార్హం. అసలు పార్థ‌ ఎవరు, ఈ హ‌త్యకు గురవుతోన్న వ్య‌క్తుల‌కీ సంబంధ‌మేంటి? అసలు పోలీసుల ఇన్విస్టిగేషన్‌లో బయటపడ్డ పురుషోత్త‌మ్ రెడ్డి (జ‌గ‌ప‌తిబాబు ) ఎవ‌రు? ఈ హ‌త్య‌ల‌కీ ఆయనకు సంబంధ‌మేంటి? ఇలాంటి వివరాలు తెలియాలంటే సింబా సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

సైంటిఫిక్ విషయాలు, క్రైం ఇన్వెస్టిగేషన్‌తోపాటు ప్ర‌కృతిని ముడిపెట్టి ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం వచ్చిన థ్రిల్ల‌ర్ సినిమాల‌కు కాస్త భిన్నంగా ఉంటుంది. అలాగే, పర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాలని చూపించిన విధానం కొత్తగా ఉంది. ఇక డైరెక్టర్ మురళీ టెక్నికల్ టీంను బాగానే ఉపయోగించుకున్నాడు. మంచి విజువల్స్, ఆర్ఆర్‌లతో బాగానే ప్రజెంట్ చేశాడు. కొత్త దర్శకుడైనా కూడా ఆ అనుభవరాహిత్యం మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి ప్రయత్నంలోనే మురళీ తన మేకింగ్ నాలెడ్జ్‌ను చూపించాడు. ఆయన మేకింగ్, టేకింగ్‌కు అందరినీ ఆకట్టుకుంటుంది.

దర్శకుడిగా మురళీ సింబా సినిమాతో అందరినీ ఆకట్టుకుంటాడు. కథ, కథనం కాస్త గాడి తప్పినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్‌ను ఆడియెన్స్‌కు కలిగించకుండా చూపించడంలో పాస్ అయ్యాడు. ఈ విషయంలో మురళీ విజయం సాధించాడు. మురళీ మేకింగ్ నాలెడ్జ్, అన్ని క్రాఫ్ట్‌ల మీదున్న పట్టు ఇందులో కనిపిస్తుంది. సినిమాకు ఏం కావాలో అది టెక్నికల్ టీం నుంచి రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

Rating: 2.5/5

Tags:    

Similar News