Guntur Kaaram Review: గుంటూరు కారం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Guntur Kaaram Review: గుంటూరు కారం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Update: 2024-01-12 09:06 GMT

Guntur Kaaram Review: గుంటూరు కారం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు.

దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత: ఎస్. రాధా కృష్ణ

సంగీత దర్శకులు: తమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటింగ్: నవీన్ నూలి

మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ తీసిన మూవీ గుంటూరు కారం. గతంలో సూపర్ స్టార్ తో అతడు, ఖలేజ లాంటి హిట్లిచ్చిన మాటల మాంత్రికుడి మేకింగ్ లో హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు వచ్చిన గుంటూరు కారం మూవీ థియేటర్లలో గుంటూరు ఘాటు తో బ్లాస్ట్ చేస్తుందా... లేదా ...

గుంటూరు కారం మూవీ కథ విషయానికి వస్తే రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వలన రమణ తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లిగా దూరంగా పెరిగిన రమణ జీవితంలోకి మళ్ళీ పాతికేళ్ల తర్వాత తల్లి దగ్గర నుండి కబురు రావడంతో రమణ మళ్ళీ తన తల్లిని వద్దకు వెళ్లాడా ? లేదా ? అసలు వసుంధర తన కొడుకుని ఎందుకు దూరం పెట్టింది ? ఈ దూరానికి కారణం ఎవరు? రమణ తండ్రి సత్యం (జయరామ్) పాత్ర ఏమిటి ? ఈ మధ్యలో ఆముక్తమాల్యద (శ్రీలీల) తో రమణ ప్రేమ కథ ఎలా సాగింది ? ఫైనల్ గా రమణ తన తల్లికి దగ్గర అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన స్టోరీ లైన్

గుంటూరు కారం లో ఘాటుగా ఏదైనా ఉందంటే, అది సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎనర్జీనే. ఎన్నడూ ఊహించని లెవల్లో తన కామెడీ, డాన్స్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ లో పూనకాలే వచ్చేశాయి. అంతగా మహేశ్ సింగిల్ హ్యాండెడ్ గా సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. ఇక మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమానే అంటున్నారు

ఇక మహేష్ తో శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్,అలానే కథను ఎలివెట్ చేస్తూ సాగిన మెయిన్ ట్రాక్ బాగున్నాయి ..శ్రీలీల నటన తో మెప్పించి , డాన్స్ తో దూసుకెళ్లింది.. అలానే మీనాక్షి చౌదరి కూడా ఉన్న రెండు మూడు సీన్లు అయినా బాగానే నటించింది.

ఇక ముఖ్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ సూపర్బ్ అని చెప్పాలి .. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా చాలా బాగుంది. విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు తగ్గట్లు బాగా నటించారు. జగపతి బాబు, ఈశ్వరి రావు , రావు రమేష్, వెన్నెల కిషోర్ అండ్ కో కూడా వారి పాత్ర మేరకు బాగా నటించారు

ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, గుంటూరు కారానికి ప్లస్ అయినట్టే పాటలు కూడా కలిసొచ్చాయి. మొదట్లో పాటల మీద ట్రోలింగ్ భారీగా జరిగినా, థియేటర్స్ లో మాత్రం సాంగ్స్ కి భారీ స్పందనొస్తోంది. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంతవరకు మ్యాజిక్ చేసింది.

త్రివిక్రమ్ సినిమా అంటేనే పంచ్ డైలాగులు, కదిలించే సీన్లు కామన్. కాని ఇందులో అవే మిస్ అయ్యాయి. తను ఈ మూవీ కంటే ఇతర ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టడం వల్లే మహేశ్ మూవీ స్క్రిప్ట్ సరిగా రాయలేదని, అందుకే కథ మార్చి మరో కథతో గుంటూరు కారం తీశాడనే కామెంట్లు ఆమధ్య వచ్చాయి. ఇప్పుడు వచ్చిన మూవీ చూసినా మహేశ్ ఎనర్జీ లెవల్స్, తన పెర్ఫామెన్స్ ఇలా తనకోసం సినిమా చూడటం తప్ప, ఇందులో త్రివిక్రమ్ మార్క్ మిస్స్ అయ్యిందనే టాక్ మాత్రం షాక్ ఇస్తోంది. ఐనా ఓవరాల్ గా మాత్రం పాజిటివ్ వైబ్స్ నే క్రియేట్ చేస్తోంది గుంటురూ కారం మూవీ. 

Tags:    

Similar News