'చిత్రలహరి' మూవీ రివ్యూ

Update: 2019-04-12 08:00 GMT

చిత్రం: చిత్రలహరి

నటీనటులు: సాయి తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్, సునీల్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: కార్తిక్ ఘట్టమనేని

ఎడిటింగ్‌: ఏ. శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి

దర్శకత్వం: కిశోర్ తిరుమల

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

విడుదల తేదీ: 12/04/2019

'తేజ్ ఐ లవ్ యు' సినిమాతో వరుసగా ఆరు డిజాస్టర్ల ను అందుకున్న మెగా మేనల్లుడు సాయి తేజ్ ప్రస్తుతం తన ఆశలన్నీ 'చిత్రలహరి' సినిమాపైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో 'హలో' బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్ మరియు 'మెంటల్ మదిలో' ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఇవాళ అనగా ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కనీసం ఈ సినిమాతో ఆయన హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి రావాలని సాయి తేజ్ ఆశిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

విజయ్ (సాయి తేజ్) ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన పేరులో ఉన్న విజయాన్ని జీవితంలో సాధించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తనని తాను ఒక దురదృష్టవంతుడి గా పరిగణించుకునే విజయ్ ఆక్సిడెంట్ కంట్రోల్ మీద ఒక యాప్ ను తయారు చేస్తాడు. దాన్ని అమ్మడం కోసం బోలెడు కంపెనీలో చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ అతని దురదృష్టం వల్ల ఎవరూ అతనికి అవకాశం ఇవ్వరు. విసుగు చెందిన విజయ్ టీవీ సర్వీస్ షాప్ లో ఒక చిన్న జాబ్ లో జాయిన్ అవుతాడు. అప్పుడే లహరి (కల్యాణీ ప్రియదర్శన్) అతనికి పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ నివేదపేతురాజ్ పాత్ర ఎంట్రీ తో కథ మొత్తం మారిపోతుంది. లహరి విజయ్ కు దూరమైపోతుంది. ఈ పరిస్థితుల్లో విజయ్ తన ప్రతిభను ఎలా నిరూపించుకుంటాడు? మళ్ళీ తన ప్రేమను తిరిగి పొందడం లేదా అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

కథ ప్రకారం ఈ సినిమా మొత్తం సాయి ధరమ్ తేజ్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చాలెంజింగ్ రోల్ అయినప్పటికీ సాయి తేజ్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచాడు. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. కల్యాణీ ప్రియదర్శన్ మరియు నివేదా పేతురాజ్ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. తేజ్ తో వారిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సునీల్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఎప్పటిలాగానే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు సునీల్. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాలో హైలైట్ గా మారుతుంది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి పాత్ర చాలా బాగుంటుంది. పోసాని నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. బ్రహ్మాజీ, జయ ప్రకాష్ తదితరులు కూడా వారి పాత్రల్లో బాగానే నటించారు. మిగతా అందరు నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమా కోసం ఒక మంచి కథను తయారు చేశారు. అంతేకాక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు కూడా పెద్దపీట వేయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఈ కథను చెప్పే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా సెట్ అయ్యింది. ఇప్పటికే కొన్ని పాటలు హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక దేవిశ్రీ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమా లో ఉండే ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరింది. ఈ సినిమాకు కార్తీక్ మంచి విజువల్స్ ను అందించారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

సాయి తేజ్ నటన

కామెడీ

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లో సాగతీత

ఎమోషనల్ డోస్ ఎక్కువ ఉండడం

చివరి మాట:

సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ, అది దర్శకుడు నెరేట్ చేసే విధానం మీదనే సినిమా ఆధారపడి ఉంటుందని తెలిసిన విషయమే. సినిమా బాగానే మొదలవుతుంది. మొదటి హాఫ్ అంతా కామెడీ, ఎంటర్టైన్మెంట్ మరియు రొమాన్స్ తో నింపేసాడు దర్శకుడు. సాయి తేజ్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ల మధ్య ప్రేమ కథ చాలా బాగా తెరకెక్కించారు. కానీ ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్ గా సీరియస్ గా మారిపోతుంది. నివేదా పేతురాజ్ ఎంట్రీతో కథ ఒక్కసారిగా మారిపోతుంది. మొదటి హాఫ్ తో పోల్చితే లో సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ కామెడీ లేదు. పైగా కథ బాగా స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని భారీ ఎమోషనల్ సన్నివేశాలు తరువాత ఆఖరికి క్లైమాక్స్ లో పర్వాలేదనిపించారు. చివరిగా 'చిత్రలహరి' ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్:

ఒక్క సారి చూడదగ్గ ఎంటర్టైనర్ 'చిత్ర లహరి'.

Similar News