Bhagavanth Kesari Movie Review: ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ
Bhagavanth Kesari Movie Review: ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ
Bhagavanth Kesari Movie Review
చిత్రం: భగవంత్ కేసరి;
నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, ఆర్.శరత్‌కుమార్, రఘుబాబు, జాన్ విజయ్, వీటీవీ గణేష్ తదితరులు;
సంగీతం: ఎస్. తమన్;
సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్;
ఎడిటింగ్: తమ్మిరాజు;
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది;
బ్యానర్: షైన్ స్క్రీన్స్;
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి;
విడుదల: 19-10-2023
యువ దర్శకులతోటి పనిచేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు నటసింహం బాలయ్య బోయపాటి తో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య గత సంక్రాంతికి గోపీచంద్ మలినేని తో “వీరసింహారెడ్డి”తో మరో హిట్ కొట్టాడు. తాజాగా టాలీవుడ్ లో కామిక్ టచ్ ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు ఆయన దర్శకత్వంలో బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” సినిమా నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది చూద్దాం.
‘భగవంత్ కేసరి’ కథేంటంటే..
నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ).. పోలీసు అడవిబిడ్డ. భీంసేరిలో జరిపిన మారణహోమం అనంతరం జైలుకెళ్లి.. అక్కడ పరిచయమైన జైలర్ శ్రీకాంత్ (శరత్ కుమార్) యాక్సిడెంట్ లో చనిపోగా.. ఆయన కూతురు విజయలక్ష్మి (విజ్జి) (శ్రీలీల)ను సొంత బిడ్డలా చూసుకుంటాడు భగవంత్. తండ్రి కోరిక మేరకు విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయాలని భగవంత్ అనుకుంటాడు. కానీ విజ్జీకి అది ఇష్టం ఉండదు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది విజ్జీ.. దేశంలో ఉన్న పోర్టులు అన్నీ కలిపే ప్రాజెక్ట్ ను దక్కించుకోవాలని రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) అనుకుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా రాహుల్ సంఘ్వి దారిలోకి విజ్జీ వస్తుంది. ఈ విషయం తెలిసిన భగవంత్ ఏం చేశాడు? భగవంత్ కేసరికి, రాహుల్ సంఘ్వికి ఉన్న పాత వైరం ఏంటి? విజ్జి పాపను ఆర్మీలో జాయిన్ చేశాడా లేదా అసలు కాజల్ అగర్వాల్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
బాలయ్య డైలాగ్స్ కానీ.. గత సినిమాలతో పోలిస్తే హావబావాలు కానీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఇక తెలంగాణ స్లాంగ్ విషయానికి వస్తే బాలయ్య తెలంగాణ డైలాగ్స్ తో అదరగొట్టారు. బాలయ్య, శ్రీలీల మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. బాలకృష్ణ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేయడం కొంచెం కొత్తగా ఉంటుంది. అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి ... ఈ పేరు శానా ఏళ్లు గుర్తుంటాది అని ట్రయిలర్ లో చెప్పిన విదంగానే పెర్ఫెక్ట్ గా ఆప్ట్ అయ్యారు. అనిల్ రావిపూడి చెబుతున్నట్లు ఒక కొత్త బాలయ్యను చూస్తాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్లాష్ బ్యాక్ మాత్రం పెద్దగా వర్కవుటవ్వలేదు. మరీ ఎలివేషన్ కోసం ఇరికించినట్లుగా అనిపిస్తుంది. కాజల్, అర్జున్ రాంపాల్ ఇతర నటి నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.
బోయపాటి తర్వాత బాలయ్యను అంత బ్యాలెన్స్డ్ గా చూపించిన ఘనత అనిల్ రావిపూడికి దక్కింది అని చెప్పచ్చు. ఎస్ఎస్ థమన్ అందించిన పాటలు స్క్రీన్‌పై ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రీసెంట్ టైమ్స్‌లో థమన్ గత చిత్రాల కంటే బెటర్ అని చెప్పచ్చు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాల బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దసరా సీజన్ లో బాలయ్య సినిమాను బాలయ్య అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా జై బాలయ్య అంటూ ధియోటర్లనుండి బయటకు రావడం పక్క.