Anni Manchi Sakunamule Review: అన్నీ మంచి శకునములే రివ్యూ.. కనిపించని మంచి శకునాలు
తీసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకురాలిగా నందినిరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. నందిని రెడ్డి సినిమా అంటే సెన్సిబుల్ హ్యుమర్, ఎమోషన్స్ తో పాటు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఆడియెన్స్ కు బలమైన నమ్మకం.
Anni Manchi Sakunamu Review: తీసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకురాలిగా నందినిరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. నందిని రెడ్డి సినిమా అంటే సెన్సిబుల్ హ్యుమర్, ఎమోషన్స్ తో పాటు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఆడియెన్స్ కు బలమైన నమ్మకం..ఈ నేపథ్యంలోనే ప్రియాంకా దత్ నిర్మాణ సారథ్యంలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా అన్నీ మంచి శకునములే టైటిల్ తో నందినిరెడ్డి మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎటెంప్ట్ చేశారు. మరి, రిలీజ్ సెంటిమెంట్ ని ఫాలో చేస్తూ ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన అన్నీ మంచి శకునములే చిత్రం టైటిల్ కి తగ్గటే శకునాలు ఉన్నాయా అంటే..
కొన్ని సినిమాలు హీరోను ఆధారంగా చేసుకొని ప్రేక్షకుల ముందుకొస్తాయి..మరి కొన్ని సినిమాలు దర్శకుల క్రేజ్ ఆధారంగా బాక్సాఫీసుల్ని పలకరిస్తుంటాయి. శుక్రవారం సెంటిమెంట్ తో విడుదలైన అన్ని మంచి శకునములే రెండవ కోవకు చెందుతుంది. ఎందుకంటే, ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే, నందినీ రెడ్డి టేకింగ్, ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ పాయింట్ కూడా కనిపించింది. మరి, ఫైనల్ జడ్జ్ మెంట్ కోరుతూ ప్రేక్షకుల ముందుకొచ్చిన అన్నీ మంచి శకునములే మెప్పించే విధంగా ఉందా..యంగ్ హీరో సంతోష్ శోభన్ కు హిట్ దొరికిందా..ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కథ:
ఒక కాఫీ ఎస్టేట్..దానిపై హక్కుల కోసం రెండు కుటుంబాల మధ్య పోరాటం. కట్ చేస్తే రెండు కుటుంబాలకు ఒకే సమయంలో పిల్లలు పుడతారు. ఒక కుటుంబానికి మగ సంతానం అయితే మరో కుటుంబానికి ఆడసంతానం జన్మిస్తుంది. అయితే డాక్టర్ తప్పిదంతో పిల్లలు తారుమారవుతారు. పిల్లలు పెరిగే క్రమంలో ప్రేమ పుడుతుంది. మరి, వీరిద్దరి ప్రేమ ఫలించిందా. కాఫీ ఎస్టేట్ గొడవలు ఏమయ్యాయి. బిడ్డలు తారుమారైన సంగతి బయటపడిందా..ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో సంతోష్ శోభన్ తన గత చిత్రాలకంటే ఈ సినిమాలో లుక్ పరంగా చాలా కొత్తగా అనిపించాడు. హీరోయిన్ మాళవికా నాయర్ కు మంచి పర్ ఫార్మెన్స్ ఉన్న రోల్ దక్కింది. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేష్, గౌతమి తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇక, దర్శకురాలు నందిని రెడ్డి గురించి మాట్లాడుకుంటే...ఆమె సినిమాలు ఒక ఫ్రేమలో ఇమిడిఉంటాయి. అంతేకాదు పాత్రలకు ప్రాధాన్యత కూడా ఉంటుంది. అన్ని మంచి శకునములే సినిమాలో కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎమోషన్స్ ఉన్నాయి. కాకపోతే..గత సినిమాలంత స్ట్రాంగ్గా లేవు. ఆసక్తికరంగా లేని కథనంతో సినిమాని నడిపి నందినిరెడ్డి ప్రేక్షకుడికి బోర్ కలిగించింది. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేష్, గౌతమి, వెన్నెల కిశోర్..ఇలా స్ట్రాంగ్ యాక్టర్స్ ఉన్నా వారిని నందినిరెడ్డి పూర్తిగా వాడుకోలేదనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది.
మ్యూజిక్ విషయానికొస్తే..అన్ని మంచి శకునములే చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందించారు. ఒక్క టైటిల్ సాంగ్ మినహా మిగతా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ జునైద్ తన కత్తెరకు మరింత పని పెట్టాల్సి ఉంది. ఇక నిర్మాత విలువలైతే చాలా రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నిర్మాత విలువలు
మాళవిక నాయర్ నటన
ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కొత్తదనం లేని కథ, కథనం
పాత్రలను ఉపయోగించుకునే తీరు
అలరించని పాటలు
ఓవరాల్ జడ్జ్ మెంట్ :
లవ్, ఎమోషన్స్ ను బేస్ చేసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు అది ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ, నందినీ రెడ్డి ఈ విషయంలో తప్పటడుగు వేశారు. అందుకే, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర సాదా సీదా స్థాయితోనే సంతృప్తి పడాల్సిన దుస్థితి వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ లేదు. దాన్ని క్యాచ్ చేసుకొని నందిని రెడ్డి హిట్టు కొడుతుందని అంతా అనుకున్నారు..కానీ గోల్డెన్ ఛాన్స్ ని లేడీ డైరెక్టర్ మిస్ చేసుకున్నారు. టైటిల్ లో ఉన్న మంచి శకునములు...బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఎదురపడలేదు.