Adipurush Review: 'ఆదిపురుష్‌' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Adipurush Review: ‘ఆదిపురుష్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Update: 2023-06-16 06:53 GMT

Adipurush Review: ‘ఆదిపురుష్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: ఆదిపురుష్‌

నటీనటులు: ప్రభాస్‌, కృతి సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సన్నీ సింగ్‌, దేవదత్త నాగే, వస్తల్‌ సేథ్‌ తదితరులు

సంగీతం: అజయ్‌ -అతుల్‌

నేపథ్య సంగీతం: సంచిత్‌ బల్హారా, అంకిత్‌ బల్హారా

సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ పళణి

ఎడిటింగ్‌: అపూర్వ మోత్వాలే సాహాయ్‌, అనిష్‌ మహత్రే

నిర్మాత: భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్‌ సుతార్‌ రాజేశ్‌ నాయర్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్‌

విడుదల సంస్థ: యూవీ క్రియేషన్స్‌, పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ

విడుదల: 16-06-2023

Adipurush Review: రామాయ‌ణగాథ ప్రతి భార‌తీయుడికి సుప‌రిచిత‌మే. కానీ ఆదిపురుష్ సినిమాలో మొత్తం రామాయ‌ణ క‌థ‌ను చూపించ‌లేదు డైరెక్టర్ ఓం రౌత్‌. రామాయ‌ణంలోని అర‌ణ్య కాండ‌, యుద్ధకాండ‌ల‌ను మాత్రమే తెర‌పై ఆవిష్కరించారు. జాన‌కి, శేషు (లక్షణుడు)ల‌తో క‌లిసి రాముడు వ‌న‌వాస‌ దీక్షకు సిద్ధం కావ‌డంతోనే ఆదిపురుష్ క‌థ మొద‌ల‌వుతుంది.. ఆ త‌ర్వాత సూర్ఫన‌ఖ రాముడిపై మ‌న‌సు ప‌డ‌టం, ఆమెకు శేషు బుద్ధిచెప్పడం లాంటి స‌న్నివేశాల‌ను ఎలాంటి క‌ల్పిత అంశాల‌కు చోటులేకుండా సినిమాలో చూపించారు ద‌ర్శకుడు. రావణాసురుడు సీతను అప‌హ‌రించే సీన్ మొదటి భాగం లో హైలైట్‌గా నిలిచింది. ఆతర్వాత హనుమాన్ సీతజాడకోసం వెళ్లడం ఆతరవాత ఏంజరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే కానీ విజ్వల్స్ పరంగా చూసుకుంటే కొంచం కొత్తగా అనిపించకమానదు.

సినిమా ప్రారంభంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు యానిమేటెడ్ శ్రీ మహా విష్ణు విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. రాముడు క‌థ ఎంతో స‌నాత‌న‌మో అంత నిత్యనూత‌న‌మైంది. రామ‌య‌ణ గాథ ఆధారంగా అనేక సినిమాలొచ్చాయి. ఒక్కో ద‌ర్శకుడు ఒక్కో కోణంలో రాముడిగాథ‌ను సిల్వర్‌స్క్రీన్‌పై చూపించారు. ఆ ద‌ర్శకుల‌కు పూర్తిగా భిన్నంగా మోడ్రన్ టెక్నాల‌జీతో ఆదిపురుష్ ద్వారా రాముడి క‌థ‌ను వెండితెర‌పై సాక్షాత్కరించారు ద‌ర్శకుడు ఓంరౌత్.

ప్రభాస్ చాలా సీన్స్ లో అద్బుతంగా సెట్ అయ్యాడు, కొన్ని చోట్ల లుక్స్ ఎందుకో కొంచం డిఫెరెంట్ గా అనిపించగా ప్రభాస్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక సీతగా కృతి సనన్ రోల్ చిన్నదే అయినా ఉన్నంత వరకు బాగా మెప్పించింది. ఇక రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ పర్వాలేదు కానీ..కానీ తన లంక సెట్ అప్ కానీ, తన సైన్యం కానీ చిన్నప్పటి నుండి మనం చూసిన రామాయణంతో కంపేర్ చేస్తే ఏమంత బాగా అనిపించదు. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మాత్రం సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగున్నాయి.

ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం. సెకండాఫ్ లో యుద్ధ సన్నివేశాలు డైలాగులు బాహుబలిని గుర్తు చేస్తాయి. గ్రాఫిక్స్ తో కూడుకున్న యుద్ధాన్ని కొత్తగా చూసినట్టు ఉంటుంది. ప్రభాస్ బాణం వేసే స్టైల్ ను బాహుబలిలో చూసాం కానీ ఇందులో సరికొత్త స్టయిల్లో బాణాలు శతువుపై సంధించడం మాత్రం చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. అందరికి తెలిసిన కథకు మోడ్రన్ టచ్ ఇస్తూ తీసిన సినిమా ఇది..కాబట్టి రామాయణ గాథతో ఇదివరకు వచ్చిన సినిమాల్ని చూడని ఆడియెన్స్ కు మాత్రం ఆదిపురుష్ మెప్పిస్తుంది.

Tags:    

Similar News