Raayan Movie Review: రాయన్‌ మూవీ ఎలా ఉంది.? దర్శకుడిగా ధనుష్‌ మెప్పించాడా.?

Raayan Movie Review: తాజాగా ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రాయన్‌ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-07-26 11:32 GMT

ధనుష్‌ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా ఒదిగిపోయి అలవోకగా నటించేస్తాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ధనుష్‌ యాక్టింగ్ కోసం సినిమా చూశే వారున్నరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దర్శకత్వంలోనూ ధనుష్‌ పలుసార్లు తనదైన మార్క్‌ను చూపించాడు. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రాయన్‌ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్‌ 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర మెప్పించిందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథేంటంటే..

రాయన్‌ (ధనుష్‌)కు ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిష‌న్‌, కాళిదాస్ జ‌య‌రామ్‌), ఒక చెల్లి (దుషారా విజ‌య‌న్‌) ఉంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తారు. దీంతో ఆ ముగ్గురుకి అన్నీ తానై అండగా నిలుస్తాడు రాయన్‌. వారిని ముగ్గురిని వెంటబెట్టుకొని బతుకుదెరువు కోసం పట్టణానికి వెళ్తాడు. అక్కడే ఓ మార్కెట్లో పనిచేస్తూ తమ్ముళ్లను, చెల్లిని పోషిస్తుంటారు. అయితే ఇప్పటికే అక్కడ దురై (శ‌ర‌వ‌ణ‌న్‌), సేతు (ఎస్‌.జె.సూర్య‌)ల మధ్య గ్యాంగ్ వార్‌ జరుగుతుంటుంది. ఈ గ్యాంగ్ వార్‌లోకి రాయన్‌ ఎందుకు ఎంటర్‌ కావాల్సి వస్తుంది.? ఈ గొడవలు రాయన్‌ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? చివరికి రాయన్‌ ఏం చేస్తాడు.? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే..

కథపరంగా చూస్తే రాయన్‌ ఒక రెగ్యులర్‌ రివేంజ్‌ స్టోరీగానే కనిపిస్తుంది. కానీ ధనుష్‌ సినిమాను తెరకెక్కించిన విధానం, నటన సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్‌ ఆఫ్‌లో పాత్రల పరిచయం ఉంటుంది. ఇక సెకండాఫ్‌లోనే అసలు కథ ఉంటుంది. ముఖ్యంగా ధనుష్‌కి, ఎస్‌జె సూర్యకి మధ్య వచ్చే సన్నివేశాలు అద్యంతం ఆకట్టుకుంటాడు. యాక్షన్‌ సన్నివేశాలు బాగా చిత్రీకరించాడు. వైవిధ్యమైన మాస్‌ సన్నివేశాలతో ఉండే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో ధనుష్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడి కంటే నటుడిగానే ధనుష్‌కు ఎక్కువ మార్కులు వేయొచ్చు. ఇక ఎస్‌జె సూర్యకూడా తనదైన నటనతో విలన్‌పాత్రలో ఆకట్టుకున్నాడు. మంచి మాస్‌, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారికి రాయన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Tags:    

Similar News