Winter Health: చలేస్తోందని.. స్వెట్టర్ వేసేసుకుని వెచ్చగా పడుకుంటున్నారా.. అయితే మీకు ఆరోగ్య ఇబ్బందులు తప్పవు.. ఎందుకంటే?

Winter Health: చలికాలం వచ్చేసింది. చలి చంపేస్తోంది. శీతల గాలులకు బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తోంది.

Update: 2021-12-30 15:00 GMT

Winter Health: చలేస్తోందని.. స్వెట్టర్ వేసేసుకుని వెచ్చగా పడుకుంటున్నారా..

Winter Health: చలికాలం వచ్చేసింది. చలి చంపేస్తోంది. శీతల గాలులకు బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. అదేసమయంలో వెళ్ళక తప్పని పరిస్థితి. ఇటువంటప్పుడు స్వెట్టర్ వేసుకోవడం తప్పనిసరి అవసరం అయింది. ఇక రాత్రి చలిని తప్పించుకుని.. వెచ్చగా పడుకోవాలన్నా.. తప్పనిసరిగా స్వెట్టర్ వేసేస్తాం. అయితే, ఇలా ఇరవై నాలుగు గంటలూ స్వెట్టర్ వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. శరీరానికి వేడి అందిస్తుందని స్వెట్టర్ వేసుకుంటే.. దానితో వచ్చే ఇబ్బందులతో మరింత సమస్య వస్తుందని వారంటున్నారు. అసలు స్వెట్టర్ వేసుకుంటే వచ్చే సమస్యలేమిటో.. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

సాధారణంగా స్వెట్టర్ వేసుకున్నపుడు దాని ఊలు మన శరీరానికి గుచ్చుకుంటుంది. దీనివలన చర్మంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్వెట్టర్ వేసుకోవడం వలన ఇవి తప్పనసరిగా వస్తాయి. అంతేకాదు ఒక్కోసారి స్వెట్టర్ వెచ్చదనం ఎక్కువగా అయిపోతుంది. చలి వేస్తోందని ఫ్యాన్ లేకుండా..స్వెట్టర్ వేసుకుని పడుకుంటే... స్వెట్టర్ వెచ్చదనానికి శరీరం చెమటలు పడుతుంది. బీపీ పడిపోవడానికి కారణం అయ్యే అవకాశాలున్నాయి... ఇలా బీపీ పడిపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

కొందరిలో శరీరంలోని వేడి బయటకు వెళ్ళే అవకాశం లేక రక్తపోటు పెరిగిపోయే చాన్స్ ఉంటుంది. దీనివలన తల తిరగడం, అలసట వంటి ఇబ్బందులు వస్తాయి. ఇక గుండె సంబంధిత సమస్యలు.. చక్కర వ్యాధి ఉన్నవారు స్వెట్టర్ వేసుకుని పడుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. స్వెట్టర్ వలన శరీరానికి గాలి తగలదు. దీంతో వేడి పెరిగిపోవచ్చు. అందువలన గుండెపోటు వచ్చే అవకాశం వస్తుందని నిపుణులు అంటున్నారు.

స్వెట్టర్ వేసుకుననపుడు శరీరానికి ఆక్సిజన్ అందే అవకాశం తగ్గుతుంది. అందువల్ల ఊపిరి ఆడకపోవడం.. మైకంగా అనిపించడం వంటి సమస్యలోస్తాయి. కొంతమంది స్వెట్టర్ తో పాటు కాళ్ళకు సాక్సులు.. చేతులకు ఉన్ని గ్లౌజులు వేసుకుంటారు. ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతుంది. వీటివలన చర్మం పోదిబారే సమస్య పెరిగిపోతుంది. తద్వారా ఎలర్జీ, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల ఈ అనారోగ్యాలతో పాటు ఇతరత్రా సమస్యలేవైనా తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా ఓసారి సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News