Without Sleep: మనిషి ఎన్ని రోజులు నిద్రకు దూరంగా ఉండొచ్చు..?

Sleep Precautions: మనిషి ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉంటారు. అసలు నిద్రపోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

Update: 2025-01-15 10:31 GMT

Without Sleep: మనిషి ఎన్ని రోజులు నిద్రకు దూరంగా ఉండొచ్చు..?

Sleep Precautions: మనిషి ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉంటారు. అసలు నిద్రపోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? రోజుకు మనిషి ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకుందాం.

మనిషికి రోజుకు తగినంత నిద్ర ఉండాలి. కనీసం ఏడున్నర నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

24 గంటలు నిద్రలేకపోతే ఇబ్బంది ఉండదు. కానీ, దాని ప్రభావం శరీరంపై కన్పిస్తుంది. ఆందోళన, నిద్ర మత్తు, స్పల్పంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. పనితీరుపై ప్రభావం చూపుతోంది. చూసే వస్తువుల ఆకారాలు భిన్నంగా కన్పిస్తాయి. విచక్షణ కోల్పోతారు.

ఇక 36 గంటలు నిద్రకు దూరంగా ఉంటే నిద్ర మత్తుతో పాటు అలసటగా ఉంటుంది. మసకగా కంటిచూపు కన్పిస్తుంది. కోపం పెరగడం, ఏకాగ్రత తగ్గిపోతోంది. క్రియేటివ్ గా ఆలోచించే సామర్ధ్యం తగ్గుతుంది. చూసే వస్తువులను మరోక వస్తువుగా భ్రమించే ప్రమాదం ఉంది.

48 గంటలు నిద్ర లేకుండా ఉంటే దాని ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. నిరాశ, ఉదాసీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో కూడా గుర్తించరు.జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళంగా పరిస్థితులుంటాయి.

72 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రకు దూరంగా ఉండడం ప్రమాదకరంగా వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక రకంగా మనిషి మరణానికి కూడా దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు.ఏదో జరిగినట్టు భ్రమ పడతారు. ఎవరో మిమ్మల్ని రహస్య మిషన్ కు పంపారని మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని భావిస్తారు.

స్వల్పకాలిక నిద్రలేమికి రోజుల తరబడి నిద్రకు దూరంగా ఉండడానికి మధ్య తేడా ఉంటుంది. సంవత్సరాల తరబడి సరైన నిద్ర లేకపోతే అది అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. స్వల్పకాలిక నిద్ర లేమితో గాయాలు, ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. పని తీరుపై శ్రద్ద అంతగా ఉండదు. వ్యక్తిగత సంబంధాల్లో కూడా సమస్యలు వస్తాయి. ఒత్తిడి,ఆందోళన వంటి లక్షణాలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వైరల్ ఫీవర్లతో పాటు ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.

సరైన నిద్ర లేకపోతే ఊబకాయం, డయాబెటీస్, గుండెజబ్బులు, డిప్రెషన్, బీపీ, క్యాన్సర్,కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News