Cold Drinks Side Effects: కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.? త్వరలోనే మీకు ఈ సమస్య రావడం ఖాయం
Side Effects of Cold Drinks: కూల్‌డ్రింక్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.
Side Effects of Cold Drinks: కూల్‌డ్రింక్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే వెంటనే కూల్ డ్రింక్స్ తెప్పిస్తుంటారు. అయితే కూల్‌డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌ను రెగ్యులర్‌గా తీసుకునే వారిలో పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెగ్యులర్‌గా కూల్ డ్రింక్స్ తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఏడాదికి 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు నమోదు అయ్యాయని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. 22 లక్షల మంది డయాబెటిస్ బారిన పడితే వారిలో 9.8 శాతం కూల్ డ్రింక్స్ తాగడం వల్లే ఈ సమస్యకు గురవుతన్నారని పరిశోధనల్లో తేలింది.
అలాగే 12 లక్షల మంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ తీసుకునే వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుందని, ఇది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిస్తాయి. ఇది కాలక్రమేణ టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఫ్రూట్ జ్యూస్‌లను తాగాలని సూచిస్తున్నారు.
కొబ్బరినీళ్లతో పాటు షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే పండ్ల రసాలను తీసుకోవాలని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ తీసుకోవడాన్ని తగ్గిస్తే.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ స్కిన్ మెరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తానికి మీరు కూల్ డ్రింక్స్ ను తాగడం తగ్గించినా.. పూర్తిగా మానేసినా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.