Health: మల్లె పూలు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎలాగో తెలుసుకోండి

Update: 2025-01-12 14:11 GMT

Health benefits of Jasmin flowers: మల్లె పూలు.. ఈ పేరు వినగానే మంచి సువాసన, అందం గుర్తొస్తుంది. అలకంరణకు, పూజకు మల్లెపూలు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కేవలం అందానికి మాత్రమే పరిమితం కాకుండా మల్లెపూలతో ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆధ్యాత్మికం, అందానికి మాత్రమే పరిమితం కాకుండా మల్లెపూలలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మల్లెలో ఉండే అనేకమైన ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.

ఎన్నో ఆరోగ్య సమస్యలకు మల్లెపూలతో చెక్‌ పెట్టొచ్చు. శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో మల్లె పూలు బాగా ఉపయోగపడతాయిని నిపుణులు చెబుతున్నారు. గుప్పెడు మల్లెపూల వాసనను గట్టిగా పీల్చుకుంటే మనసు హాయిగా మారుతుంది. అంతేకాదండోయ్‌ తలలో పెట్టుకోవడం వల్ల కూడా మల్లెపూలతో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మల్లెపూలను తలలో పెట్టుకుంటే జుట్టు రాలకుండా, తలలో పుండ్లు ఏర్పడకుండా, సూక్ష్మక్రిములు చేరకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టుకు కావాల్సిన పోషక విలువలను అందిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టడంలో కూడా మల్లెపూలు బాగా పనిచేస్తాయి. ప్రశాంతమైన నిద్రకు కూడా మల్లెపూలు దోహదపడతాయి. మల్లె పూలతో చేసిన టీ తాగినా ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో సూక్ష్మక్రిమి సంహారిగా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంతాన సమస్యలను దూరం చేయడంలో, పచ్చ కామెర్లకి దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక మల్లె ఆకులతో తయారు చేసిన ఆయుర్వేద మందులు మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జాస్మిన్‌ ఆయిల్‌ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్‌ను కీళ్లకు అప్లై చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.

నోట్‌: ఈ వివరాలు ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించనవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.

Tags:    

Similar News