Garlic Oil: వెల్లుల్లి నూనెతో ఇన్ని లాభాలున్నాయా.? తెలిస్తే అస్సలు వదలరు..!

Garlic Oil: వెల్లుల్లితో ఎన్నో లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-08 10:36 GMT

Garlic Oil: వెల్లుల్లి నూనెతో ఇన్ని లాభాలున్నాయా.? తెలిస్తే అస్సలు వదలరు..!

Garlic Oil: వెల్లుల్లితో ఎన్నో లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంటింట్లో కచ్చితంగా లభించే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే వెల్లుల్లి నూనెతో కూడా లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? వెల్లుల్లి నూనెలోని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అలాగే వెల్లుల్లిలోని యాంటీ వైరల్‌ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు సంబంధిత సమస్యలు దూరం చేయడంలో కూడా వెల్లుల్లి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్, మొటిమలు, మచ్చలు, ముడతలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వెల్లుల్లి నూనెను తలకు పెట్టుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

వెల్లుల్లి నూనెతో తలనొప్పి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నూనెను తరచుగా ఉపయోగిస్తే జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా చిత్తవైకల్యం వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి నూనె కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తాయి. కాటన్‌తో వెల్లుల్లి నూనెను ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్న చోట అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి నూనె తయారీ..

వెల్లుల్లి నూనెను తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా తీసుకుని కచ్చాపచ్చాగ దంచుకోవాలి. అనంతరం కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ నూనెలో అప్పటికే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేయాలి. ఆ తర్వాత స్టవ్‌ మీద నూనెను మరిగించాలి. తక్కువ మంటతో మరిగించుకోవాలి. వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత స్ట్‌వ్‌ ఆఫ్ చేసి నూనెను చల్లారాక వడకట్టుకొని ఒక బాటిల్‌లోకి తీసుకోలి. ఇక జుట్టుకు అప్లై చేసుకుంటే సరిపోతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం. 

Tags:    

Similar News