Mobile Phone: రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్‌ చూస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా?

Mobile Phone: స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వారకు ఫోన్‌లతో కుస్తీలు పడుతున్నారు.

Update: 2025-01-08 14:30 GMT

Mobile Phone: రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్‌ చూస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా?

Mobile Phone: స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వారకు ఫోన్‌లతో కుస్తీలు పడుతున్నారు. గంటలతరబడి ఫోన్ చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ను అతిగా వాడడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని తెలిసిందే. మానసిక ఆరోగ్యం మొదలు, శారీరక ఆరోగ్యం వరకు అన్నింటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు స్మార్ట్‌ ఫోన్స్‌ను ఉపయోగించడం వల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

రాత్రు పడుకునే ముందు స్మార్ట్‌ ఫోన్‌ చూస్తే కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. చీకట్లో ఫోన్‌ చూస్తున్నప్పుడు ఫోన్‌ నుంచి వచ్చే బ్రైట్‌నెస్‌ కంటి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా. మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్స్‌ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* చీకట్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించడం వల్ల కంటి చూపు మందగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే తలనొప్పి, కంటి చికాకు, కంటిలో నుంచి నీరు కారడం కళ్లు డ్రైగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో కంటి చూపు తగ్గడానికి ఇది కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఫోన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కారణంగా కళ్ల రెటీనాపై పడుతుంది. ఇది కంటి అలసట, డ్రై ఐ సిండ్రోమ్, దృష్టి క్షీణతకు దారితీస్తుంది. కాబట్టి రాత్రిపూట లైట్లు లేకుండా చీకటిలో కూర్చొని ఫోన్ ఉపయోగించడం వల్ల ఇబ్బందులు వస్తాయి.

* రాత్రిపూట ఫోన్‌లను వాడడం వల్ల నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిద్రకు అవసరమైన హార్మోన్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. నిద్రలేమికి దారి తీస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

* స్క్రీన్స్‌ను ఎక్కువసేపు చూడడం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దీనిని డిజిటల్ ఐ స్ట్రెయిన్‌గా చెబుతుంటారు. చూపు మందగించడం, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.

* రాత్రిపూట స్క్రీన్‌ను చూసే సమయంలో కొన్ని టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నైట్ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలని చెబుతున్నారు. స్క్రీన్‌ను చూసే సమయంలో కచ్చితంగా బ్రేక్స్ ఇవ్వాలని చెబుతున్నారు. రాత్రి లైట్స్‌ ఆఫ్‌ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గ్యాడ్జెట్స్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం. 

Tags:    

Similar News