Cracked Eggs: పగిలిన కోడి గుడ్డుతో అమ్లేట్‌ వేసుకుంటున్నారా.? ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త..!

Cracked Eggs: ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా కోడి గుడ్డు ఉంటుంది. అందుబాటులో ఏ వంటకం లేకపోతే వెంటనే ఒక గుడ్డుతో కర్రీ వండేస్తుంటారు.

Update: 2025-01-04 05:40 GMT

Cracked Eggs: ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా కోడి గుడ్డు ఉంటుంది. అందుబాటులో ఏ వంటకం లేకపోతే వెంటనే ఒక గుడ్డుతో కర్రీ వండేస్తుంటారు. ఉడకబెట్టుకొని, ఆమ్లేట్‌ వేసుకొని ఇలా రకరకాలుగా కోడి గుడ్లను తింటుంటారు. అయితే మనలో చాలా మంది పగిలిన కోడి గుడ్డును పడేయ్యడానికి ఇష్టపడరు. వెంటనే దానిని ఆమ్లేట్‌ చేసుకొని తింటుంటారు. అయితే ఇలా పగిలిన కోడి గుడ్లను తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

పగుళ్లు వచ్చిన కోడి గుడ్లను తినడం వల్ల శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. పగిలిన కోడి గుడ్లలో సాల్మొనెల్లా అనే ప్రాణాంతక బ్యాక్టీరియా చేరుతుందని అంటున్నారు. ఈ బ్యాక్టీరియా షెల్ ద్వారా గుడ్డులోకి ప్రవేశించి దానిని తిన్న వ్యక్తికి సోకుతుంది. సాల్మొనెల్లా ఫుడ్ పాయిజనింగ్, కడుపు తిమ్మిరి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

ఈ ఇన్ఫెక్షన్‌ కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల్లో, వృద్ధుల్లో ప్రాణాంతక వ్యాధికి దారి తీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గుడ్డుపై పగుళ్లతో పాటు లోపలి భాగం బయటకు కనిపిస్తున్నట్లయితే దానిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు దుర్వాసన వస్తున్నా ఉపయోగించకూడదు. పగిలిన గుడ్డును నీటిలో వేస్తే నురుగు వస్తే అది తినడానికి పనికిరాదని అర్థం.

వీలైనంత వరకు తాజాగా కోడి గుడ్లను మాత్రమే ఉపయోగించాలి. ఇక కోడి గుడ్లను నీటితో కడగకూడదు. దీనివల్ల పెంకుపై ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా కోడి గుడ్డు పగిలితే వాటిని ఉపయోగించకూడదు. 

Tags:    

Similar News