Bitter Gourd Benefits: చేదుగా ఉన్నా కాకరకాయ తినమనేది ఇందుకే..!
Bitter Gourd Benefits: కాకరకాయ అనగానే చాలా మంది తల తిప్పుకుంటారు. వామ్మో చేదు మాతో కాదంటారు.
Bitter Gourd Benefits: కాకరకాయ అనగానే చాలా మంది తల తిప్పుకుంటారు. వామ్మో చేదు మాతో కాదంటారు. అయితే కాకరతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కాకరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాకకరాయను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయను డయాబెటిస్ పేషెంట్స్ వరంలాంటిదని చెబుతుంటారు. ఇందులోని చరాంతిన్ అనే నేచురల్ స్టెరాయిడ్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతారు. క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేసేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ వారంలో ఒక్కసారైనా కచ్చితంగా కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుంటారు. జ్యూస్ రూపంలో తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ఇక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా కాకరకాయ బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు భారీగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె సమస్యలున్న వారు, గుండె వ్యాధుల నుంచి కోలుకున్న వారు కచ్చితంగా కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.
కాకరకాయలో బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ విటమిన్ల లోపాన్ని జయించవచ్చు. ఇక కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే.. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కాకరకాయ ఎంతో తోడ్పడుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో కూడా కాకరకాయ ఉపయోగపడుతుంది.
కాకరయను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని ఔషధ గుణాలు లివర్‌లోని వ్యర్థాలు బయటకు పంపంచడంలో తోడ్పడుతాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా కాకరకాయ బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు చెబుతుంటారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వీటినే ప్రామాణికంగా ఎప్పుడు పాటించకూడదని రీడర్స్ గమనించాలి.