Uric Acid Symptoms: శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎంత ఉండొచ్చు.? ఎక్కువైతే ఏమవుతుంది?

Uric Acid Symptoms: శరీరంలో యూరిక్‌ యాసిడ్ ఉత్పత్తి కావడం సర్వసాధారణమైన విషయం.

Update: 2025-01-03 10:09 GMT

Uric Acid Symptoms: శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎంత ఉండొచ్చు.? ఎక్కువైతే ఏమవుతుంది?

Uric Acid Symptoms: శరీరంలో యూరిక్‌ యాసిడ్ ఉత్పత్తి కావడం సర్వసాధారణమైన విషయం. వ్యూరిన్‌ అనే పదార్థం విచ్చిన్నం కావడం వల్ల ఏర్పడే రసాయనాన్నే యూరిన్‌ యాసిడ్‌గా చెబుతుంటారు. శరీరంలో యూరిక్‌ యాసిడ్ ఎక్కువైతే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే ఏమవుతుంది.? ఎలాంటి లక్షణాల ఆధారంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిన విషయాన్ని తెలుసుకోవచ్చంటే.

శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే మూత్ర పిండాల్లో రాళ్లు, దీర్ఘకాలిక మూత్ర పిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే.. అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, మెటబాలిక్ సిండ్రోమ్‌ వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. మధుమేహం, స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెరగడానికి యూరిక్‌ యాసిడ్ కారణమవుతుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో యూరిక్‌ యాసిడ్ ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అర్థరైటిస్‌ ఫౌండేషన్ ప్రకారం.. యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులలో 7 మిల్లీగ్రాముల డెసిలీటర్‌కు (mg/dL), మహిళల్లో 6 mg/dL కంటే ఎక్కువగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటికంటే ఎక్కువగా ఉంటే సమస్యగా పరిగణించాలని చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో యూరిక్‌ యాసిడ్ ష్థాయిలు పెరిగితే కొన్ని లక్షణాల ఆధారంగా అంచనా వేయొచ్చు. కాలి బొటనవేలులో నొప్పిగా ఉండడం, కాలి బొటనవేలు వాపు రావడం, చీలమండ నుంచి మడమ వరకు నొప్పిగా ఉంటే యూరిక్‌ లెవల్స్‌ పెరిగినట్లు అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఉదయం నిద్రలేవగానే అరికాలిలో లేదా మోకాలి నొప్పి ఉంటుంది. వీటితో పాటు.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు నొప్పి, కీళ్లలో దృఢత్వం, చుట్టుపక్కల చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన, నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కూడా శరీరంలో యూరిక్‌ స్థాయిలు పెరిగాయని చెప్పేందుకు సంకేతంగా భావించాలని చెబుతున్నారు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగా మాత్రమే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News