Lifestyle: వీటికి దూరంగా ఉండకపోతే.. పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి..!
Lifestyle: ప్రస్తుత రోజుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువుతున్నాయి. ఒకప్పుడు కేవలం మహిళలకే పరిమితం అనుకున్న ఈ సమస్య ప్రస్తుతం పురుషుల్లోనూ కనిపిస్తోంది.
Lifestyle: ప్రస్తుత రోజుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువుతున్నాయి. ఒకప్పుడు కేవలం మహిళలకే పరిమితం అనుకున్న ఈ సమస్య ప్రస్తుతం పురుషుల్లోనూ కనిపిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా సంతానలేమి సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే పురుషుల్లో మెజారిటీ వారు తెలిసి చేస్తున్న తప్పుల వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను ప్లాన్ చేసుకున్న పురుషులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల్లో స్పెర్మ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ నాణ్యత తగ్గడం వల్ల సంతానలేమి సమస్యలు ఎక్కువుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కొన్ని రకాల జీవన శైలిలో వచ్చిన మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తున్నట్లు గుర్తించారు. ఇంతకీ వీర్యకణాలను దెబ్బతీస్తున్న ఆ ఫుడ్ ఏంటంటే..
పిల్లల కోసం ప్లాన్ చేసే పురుషులు కనీసం 6 నెలల ముందు నుంచి స్మోకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. స్మోకింగ్ చేసే వారిలో శుక్ర కణాల నాణ్యత తగ్గినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అదే విధంగా ఆల్కహాల్‌కు కూడా పూర్తిగా దూరంగా ఉండాలి. ఇక జంక్ ఫుడ్‌ను తీసుకోవడం మానేయాలని చెబుతున్నారు. అలాగే సోడా, కూల్ డ్రింక్స్ వాటి వల్ల కూడా స్పెర్మ్ చలనశీలత తగ్గుగుతందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
పురుషులు సోయపాలు, టోఫు వంటి సోయా ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. పురుషుల్లో సంతానలేమికి సోయా ఉత్పత్తులు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్యాకేజింగ్ ఫుడ్‌లో ఉండే బిస్ఫినాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ లాగా పనిచేస్తుంది. ఇది పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి. ఇక జున్ను, ఫుల్-క్రీమ్ మిల్క్ వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలకోసం ప్లాన్ చేస్తున్న పురుషులు కొన్ని నెలల ముందు నుంచి బేకన్, సలామీ, బీఫ్ జెర్కీ, హాట్ డాగ్‌ల వంటి ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి. ఇందులోని నైట్రేట్‌లు, స్పెర్మ్ ప్రకోపకాలుగా పనిచేసే ఇతర రసాయనాలు ఉంటాయి. ఇవి పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
నోట్: ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.