Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? క్యాన్సర్‌ కావొచ్చు

Update: 2024-12-29 10:11 GMT

Early symptoms of cancer in Telugu: అనారోగ్య సమస్యల పరంగా ప్రపంచాన్ని భయపెడుతోన్న జబ్బుల్లో క్యాన్సర్‌ ప్రధానమైంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ఈ మహమ్మారి కారణంగా మరణిస్తున్నారు. శాస్త్ర సాంకేతికంగా మనిషి ఎంత ఎదిగినా క్యాన్సర్‌ మరణాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. చిన్న యవసులో ఉన్న వారు కూడా క్యాన్సర్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్‌ మహమ్మారిని త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్‌ వచ్చే ముందు శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి డైట్‌ మెయింటెన్‌ చేయకపోయినా, వర్కవుట్స్‌ చేయకపోయినా ఉన్నపలంగా బరువు తగ్గితే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అకారణంగా 5 కిలోలు తగ్గితే కచ్చితంగా వైద్యులను సంప్రందించి సంబంధిత పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. కడుపు సంబంధిత క్యాన్సర్‌ వస్తే ఆకలి మందగిస్తుంది. ఎప్పుడూ కడుపు నిండిన భావన కలుగుతుంది. ముద్ద మింగడం ఇబ్బందిగా మారుతుంది. కడుపు నిత్యం ఉబ్బరంగా ఉంటున్నా, దీర్ఘకాలంగా జీర్ణ సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇక ఏ పని చేయకపోయినా త్వరగా అలసటగా ఉండడం, చిన్న చిన్న పనులకు ఆలసిపోతున్నట్లు అనిపించినా, ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోతే అలర్ట్‌ అవ్వాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. మలంలో మలం పడుతున్నా, మలం రంగు నలుగు రంగులోకి మారినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది పెద్ద పేగు క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణంగా భావించాలని అంటున్నారు.

అదే విధంగా దీర్ఘకాలంగా తలనొప్పిగా ఉండడం, మెడనొప్పి వేధిస్తుండడం కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు ముందస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. నోటిలో చాలా కాలంగా పుండ్లు, మచ్చలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే జననాంగాల్లో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు ఎంతకీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో రొమ్ములో మార్పులు రావడం చనుమొనల నుంచి రక్తం లేదా ఇతర స్రావాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతున్నారు. ఇది రొమ్ము క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు.

Tags:    

Similar News