Rice Water for Skin: మీ ముఖం అందంగా మెరిసిపోవాలా? రైస్ వాటర్‌తో ఇలా చేయండి..!
Rice Water for Glowing Face: చలికాలంలో చర్మం త్వరగా పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు.
Rice Water for Glowing Face: చలికాలంలో చర్మం త్వరగా పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. దానికి తోడు గృహ చిట్కాలను సైతం పాటిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో రైస్ వాటర్ ఒకటి. రోజూ రైస్ వాటర్‌తో ముఖం కడిగితే ఫేస్ మెరిసిపోతుంది.
బియ్యం కడిగిన నీటిని వృధాగా పారబోస్తుంటారు. మరికొందరైతే మొక్కలకు పోస్తారు. కానీ రెండుసార్లు కడిగి పడేసిన తర్వాత మూడోసారి కడిగిన నీటిని ముఖానికి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లోయింగ్‌గా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఈ నీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఫెరులిక్ యాసిడ్, అల్లాంటోయిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి స్కిన్ టోన్ మెరిసేలా చేసేందుకు సహాయపడతాయంటున్నారు నిపుణులు.
రైస్ వాటర్‌ని ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుందని చెబుతున్నారు. మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలోనూ చర్మంపై ఉన్న నల్ల మచ్చలు, మంట, వాపును తగ్గించడంలోనూ బియ్యం కడిగిన నీరు సహాయపడుతుందని అంటున్నారు.
బియ్యం నీటిలో ఉండే విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు చర్మంపై ఉన్న రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతాయంటున్నారు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని.. అది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుందంటున్నారు. ముఖంపై మొటిమలు ఉన్నవారు ప్రతిరోజు ఈ నీటితో ముఖం కడుక్కుంటే.. చర్మం తేమగా, మృదువుగా మారుతుందంటున్నారు. ఇది న్యాచురల్ టోనర్‌గా పనిచేసి PH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుందని దీంతో ముఖం మెరుస్తుందనేది నిపుణుల సూచన
రైస్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అందువల్ల ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది. ఈ నీటిని ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ముడతలు సైతం తగ్గుతాయి. ఇది చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా పోషణను అందిస్తుంది.
నోట్: ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.