Merry Christmas 2024: క్రిస్మస్‌కి ఈ సూపర్ కోట్స్‌తో మీ స్నేహితులకు విష్ చేయండి..
Merry Christmas Greetings: క్రిస్మస్ పండగ వచ్చేసింది. ఈ వేడుకను క్రైస్తవులు ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. అలాంటి వారికి ఈ పండగకు విషెస్ తెలుపుతూ మీరు ఈ కోట్స్ తో వాట్సాప్ ద్వారా విష్ చేయవచ్చు. అవేంటో చూద్దాం.
క్రిస్మస్ వచ్చిందంటే చాలు..క్రైస్తువుల ఇంట నెలరోజుల ముందు నుంచే సంబురాలు షురూ అవుతాయి. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్టియన్స్ కు శుభాకాంక్షలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మీరు మీ కుటుంబీకులకు, శ్రేయోభిలాషులకు ఈ అందమైన కోట్స్ తో క్రిస్మస్ విషేస్ చెప్పవచ్చు.
ఈ క్రిస్మస్ పండగ..
మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు..
సుఖ సంతోషాలను నింపాలని ఆశిష్తూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.
క్రిస్మస్ రోజు శాంటా తాతా వస్తాడు
మనం ఆశ్చర్యపోయే బహుమతులు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతను
అందరిలోనూ ఆనందం నింపుతారు
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఆ దేవుడి వల్ల దీర్ఘాయువు కలుగును..
మరింత కాలం మీరు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఏసు జన్మించిన ఈ పవిత్ర రోజు
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనందరం
మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని
మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ రోజు.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.