Black Cumin: నల్ల జీలకర్రతో నమ్మలేని లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..!
Black Cumin: ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో జీలకర్ర ప్రధానమైంది. జీలకర్ర లేని వంటకాన్ని ఊహించుకోవడం కష్టం.
Black Cumin: ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో జీలకర్ర ప్రధానమైంది. జీలకర్ర లేని వంటకాన్ని ఊహించుకోవడం కష్టం. ఇక జీలకర్రతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా తెలిసిందే. ఎన్నో రకాల సమస్యలకు జీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కూడా జీలకర్రకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మీకు నల్ల జీలకర్ర గురించి తెలుసా.?
దీనినే చేదు జీలకర్రగా కూడా పిలుస్తుంటారు. సాధారణ జీలకర్రతో పోల్చితే ఇందులో మరెన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని రసాయనిక పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. నల్ల జీలకర్ర ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెడుతుందని ఇప్పటికే నిర్వహించిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ముఖ్యంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలకు నల్ల జీలకర్ర పెట్టింది పేరు. ఇవి కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలన్నీ నల్లజీలకర్రతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కిడ్నీ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా నల్లజీలకర్ర కీలకపాత్ర పోషిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను సైతం నయం చేస్తాయి.
ఇక రక్తపోటుతో బాధపడేవారికి కూడా నల్లజీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేయడంలో ఉపయోపగుడుతంది. ఇక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా నల్లజీలకర్ర సహాయడుతుంది. నల్లజీలకర్రను రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో ఉండే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా నల్లజీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తరచూగా వచ్చే దగ్గు, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో నల్ల జీలకర్ర కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతీరోజూ ఉదయం పరగడుపున నల్లజీర్ర నీటిని తాగితే అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు. రాత్రంతా జీలకర్రను నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగితే మెరుగైన ఫలితం పొందొచ్చు.
నోట్: ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.