Best Foods: చలికాలంలో గర్భిణీలు.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Best Foods: ప్రతీ మహిళా జీవితంలో తల్లి కాబోయే సందర్భం ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-13 05:46 GMT

Best Foods: చలికాలంలో గర్భిణీలు.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Best Foods: ప్రతీ మహిళా జీవితంలో తల్లి కాబోయే సందర్భం ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనలాంటి మరో రూపానికి జన్ననిస్తాన్న ఆలోచనే కొత్తగా ఉంటుంది. ఇక గర్భిణీల జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తుంటాయి. తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎన్నో మార్పులు చేసుకుంటారు. వైద్యులు సైతం కొన్ని సూచనలు చేస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగా జలుబు, దగ్గు వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే గర్భిణీలు(Pregnant Women) కచ్చితంగా తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్‌ను కచ్చితంగా భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* గర్భిణీలు చలికాలంలో తీసుకునే ఆహారంలో కచ్చితంగా పాలకూర(Spinach)ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఐరన్‌ కంటెంట్‌ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్త కణాల నిర్మాణంలో తోడ్పడుతుంది. దీంతో తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక పాలకూరలో ఫోలేట్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

* గర్భిణీలు కచ్చితంగా డ్రై ఫ్రూట్స్‌(Dried Fruit)ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్‌ను తీసుకోవాలి. ఇందులోని విటమిన్‌ ఇ, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు సమస్య బారిన పడకుండా చూడడంలో డ్రై ఫ్రూట్స్‌ ఉపయోగపడుతుంది.

* గర్భిణీలు కచ్చితంగా చేపలను డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగడపతుంది. అలాగే గుండెతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపులో బిడ్డ మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయి.

* చిలకడదుపంలో పుష్కలంగా లభించే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగడపతుంది. దీంతో చలికాలంలో తరచూ వచ్చే వ్యాధుల బారిన పడకుండా అడ్డుకుంటుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే విటమిన్‌ సి ఎక్కువగా లభించే సిట్రస్‌ జాతి పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లు తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్‌ వ్యాధులను తగ్గిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News