Happy Marriage Life: ఇలా చేస్తే మీ మ్యారేజ్ లైఫ్ ప్రతీరోజూ పండగే అవుతుంది
Secret Mantra for Happy Wedding: మ్యారేజ్ లైఫ్ మస్తు హ్యాపీ లైఫ్ అయ్యేలా చేసే ఆ సింపుల్ టిప్స్ పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి వివాహ బంధాన్ని పండగలా మార్చే ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.
Secret Mantra for Happy Wedding: వివాహ బంధం ప్రతీరోజూ పండగే కావాలంటే దానికి కూడా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఎవరూ చెప్పరు. ఎవరికి వారే అవేంటో తెలుసుకుంటే మ్యారేజ్ లైఫ్ మస్తు హ్యాపీ లైఫ్ అవుతుంది. లేదంటే ఈ పెళ్లెందుకు చేసుకున్నాన్రా బాబూ అనిపిస్తుంది. పైగా ఆ సింపుల్ టిప్స్ పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి వివాహ బంధాన్ని పండగలా మార్చే ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.
సెలబ్రేట్ చేసుకోవాలి
మ్యారేజ్ అనేది బ్యూటీఫుల్ జర్నీ. ఆ జర్నీలో సెలబ్రేషన్స్ లేకపోతే అది బ్యూటీఫుల్ అనిపించుకోదు. అందుకే మీ జీవిత భాగస్వామి విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. అది చిన్న విజయమైనా, పెద్ద విజయమైనా, ఆఫీసులో ప్రాజెక్ట్ సక్సెస్ అయినా, ప్రమోషన్ అయినా... వారి విజయాన్ని ఎంజయ్ చేయాలి. చివరకు ఒంటిట్లో రుచిగా వండిన ఆహారపదార్థాలను కూడా మెచ్చుకుంటే మీరు వారి శ్రమను గుర్తించినట్లు అవుతుంది.
అదే స్పార్క్, అదే రొమాంటిక్ టచ్
వివాహ బంధం పాతదవుతున్న కొద్దీ కొంతమందిలో స్పార్క్ తగ్గిపోతుంది. కానీ అది కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, దాంపత్య జీవితం ఎంత పాతదయినా... ఎప్పటికప్పుడు మీ జీవిత భాగస్వామిని కొత్తకొత్త సర్‌ప్రైజ్‌లతో సర్‌ప్రైజ్ చేస్తూనే ఉండండి. అది డిన్నర్ డేట్ అయినా కావచ్చు.. లేదంటే సర్ ప్రైజ్ వీకెండ్ ఔటింగ్ కావచ్చు.. పెళ్లయిన కొత్తలో ఉన్న స్పార్క్, రొమాంటిక్ టచ్‌ను కోల్పోవద్దు.
ఒడిదుడుకుల్లో నేనున్నానని చెప్పాలి
పెళ్లంటే ఒక్కరి జీవితం కాదు. అది భార్య అయినా, భర్త అయినా... ఇద్దరిదీ సమానమే. ఏ కష్టమొచ్చినా, ఏ నష్టమొచ్చినా... అందులో చెరో సగం అని పంచుకుంటేనే ఆ వివాహ బంధం కుంటుపడకుండా ముందుకు సాగుతుంది. అలా కాకుండా జీవిత భాగస్వామికి వచ్చే సమస్యలను నావి కావు అనుకుంటే ఆ వివాహ బంధం అంతటితోనే ఆగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఇద్దరూ కలిసి అడుగేయాలి. అడుగడుగునా ఒకరికొకరు నీకు నేనున్నాను అని చెప్పుకోగలిగితే వారికి జీవితం పండగే అవుతుంది.
తగ్గితే పోయేదేం లేదు
భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు సహజం. అవి లేని కాపురం ఉండదేమో!! కానీ గొడవ జరిగినప్పుడు, అందులో మీ తప్పు ఉందనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఒక 'సారీ' చెబితే పోయేదేం లేదని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. పంతాలకు పోయి నేనెందుకు సారీ చెబుతా అనుకుంటే తప్పు చేయని వారిని అది ఇంకా బాధిస్తుంది.
ఏదీ దాచిపెట్టొద్దు
దాంపత్యంలో దాపరికాలు లేకుండా చూసుకుంటే వారి రిలేషన్‌షిప్ చాలా హెల్తీగా ఉంటుంది. ఏ విషయమైనా జీవిత భాగస్వామికి తెలియకుండా దాచిపెట్టొద్దు. అది వారికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది.
కాసేపు హాయిగా నవ్వుకోండి
ప్రతీరోజు కాసేపు ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుకోండి. నచ్చిన జోక్ చెప్పుకోండి లేదా నచ్చిన సినిమా చూడండి. ఏదేమైనా ఇద్దరూ కలిసి కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకోగలిగితే... మీ దాంపత్యానికి అది వెయ్యేనుగుల బలం ఇస్తుంది.
పడక సమయానికి ప్యాచప్
పగలంతా ఎన్ని గొడవలు పడినా... ఎంత అలకబూనినా... నైట్ బెడ్ టైమ్ కల్లా వాటన్నింటికీ ప్యాకప్ చెప్పి ప్యాచప్ చేసుకోవాలి. ఆనందంగా ఆ రోజును ముగించాలి. ఏ టెన్షన్ లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. మళ్లీ మరునాడు ఫ్రెష్‌గా మరో కొత్త రోజును స్టార్ట్ చేయాలి. ఇది ఎప్పటికప్పుడు మీ జీవితానికి కావాల్సిన కొత్త బలాన్నిస్తుంది. అలా కాకుండా ఈరోజు టెన్షన్‌ను రోజుల తరబడి కొనసాగించడం అంటే... అన్ని రోజులపాటు జీవితంలో ఆనందాన్ని కోల్పోవడమే అవుతుంది.
అభిప్రాయానికి విలువ ఇవ్వండి
మీ జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వండి. వారు ఏం చెబుతున్నారో వినండి. విషయం ఏదైనా కలిసి పంచుకోండి. సలహాలు ఇవ్వండి, సలహాలు తీసుకోండి.
బంధానికి విలువ ఇవ్వండి
లాస్ట్ బట్ నాట్ లీస్ట్... అన్నింటికి మించి మీ బంధానికి విలువ ఇవ్వండి. బంధం అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు... వారి అమ్మానాన్నలు, తోబుట్టువులు కూడా ఒక కుటుంబమే అనే విషయం మర్చిపోవద్దు. మీ జీవిత భాగస్వామితో ఎంత ప్రేమతో ఉంటారో.. అంతే ఆప్యాయం, ఆత్మీయత వారిపై కూడా చూపిస్తే ఆ వివాహ బంధానికి ఇక తిరుగేలేదు అనే విషయం మర్చిపోవద్దు.
చాలా కుటుంబాల్లో పెళ్లవగానే వేరు కాపురం, వేరు సంసారం అంటూ అప్పటివరకు ఉన్న కుటుంబాన్ని గాలికి వదిలేస్తున్నారు. వారి అమ్మానాన్నలు, తోబుట్టువులను లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇక్కడే చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కానీ అది మీ జీవిత భాగస్వామిపై చూపించే అసలైన ప్రేమ కాదనే విషయం కూడా మర్చిపోవద్దు. ఈ రూల్స్ పాటిస్తే మీ మ్యారేజ్ లైఫ్ ప్రతీ రోజు పండగే (Happy Married Life) అవుతుంది.