Health: చలికాలం పాయ సూప్‌ తాగితే ఏమవుతుందో తెలుసా?

Update: 2025-01-05 14:04 GMT

Health benefits of mutton paya soup in winter season: ఇతర సమయాలతో పోల్చితే చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో వ్యాధులు వస్తుంటాయి. అందుకే చలికాలం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మరి చలికాలంలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తూనే నోటికి రుచిని అందించే బెస్ట్‌ ఫుడ్స్‌లో ఒకదాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

చలికాలంలో చాలా మంది ఎంతో ఇష్టంగా తీసుకునే ఫుడ్స్‌లో పాయ ఒకటి. చల్లటి చలిలో వేడి వేడిగా పాయ లాగిస్తుంటే. అబ్బబ్బా ఆ టేస్టే వేరని చెప్పాలి. అయితే కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా పాయా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మటన్‌ పాయాను తీసుకుంటే కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా చలికాలంలో భోజనప్రియులు వారికి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. దీంతో అధిక బరువు పెరుగుతారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడంలో పాయా బాగా ఉపయోగపడుతుంది. పాయా సూప్‌ను తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది పరోక్షంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

* పాయా సూప్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల దృఢంగా మారుతాయి. పాయా సూప్‌లో మినరల్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫ్లోరైడ్, పొటాషియం వంటి మంచి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా మార్చుతాయి.

* చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో జలుబు, దగ్గు ప్రధానమైనవి. పాయా సూప్‌లో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు, జలుబు లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* పాయా సూప్‌లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే ఎల్-గ్లుటామైన్ పేగుల్లో మంటను తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

* మెరిసే చర్మానికి కూడా పాయా సూప్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని కొల్లాజెన్, హైలురోనిక్ యాసిడ్ చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. దీంతో చర్మంపై ఏర్పడు ముడతలు తగ్గుతాయి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించాలి.

Tags:    

Similar News