Health Tips: చక్కెరకు బాగా అలవాటు పడ్డారా? అయితే ఇలా కంట్రోల్ చేయండి

Update: 2025-01-14 09:51 GMT

Health Tips: చక్కెరకు బాగా అలవాటు పడ్డారా? అయితే ఇలా కంట్రోల్ చేయండి

Best alternatives for sugar : చక్కెర ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే ఒక తియ్యటి పదార్థం. దీనిని తీపి వంటకాలతో పాటు ఛాయ్, కాఫీ, పాలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. స్వీట్ ప్రియులు ఈ చెక్కరను ఇష్టంగానే తింటారు కానీ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం దీనిని వైట్ పాయిజన్‌ అనే పిలుస్తారు. దీనికి బానిసలుగా మారితే బయటికి రావడం చాలా కష్టం. మార్కెట్‌లో సహజసిద్ధమైన చక్కెర లభించడంలేదు. దీనికి రకరకాల కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల రకరకాల వ్యాధులకి గురవుతున్నారు. ముఖ్యంగా దేశంలో షుగర్ పేషెంట్లు రోజురోజుకి పెరుగుతున్నారు. అందుకే చక్కెర వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరకు బదులు సహజసిద్ధమైన తీపి పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం అంటున్నారు. అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర లేని స్వీట్లని ఊహించుకోవడం కొంచెం కష్టమే. కానీ కొన్ని రకాల స్వీట్లను బెల్లంతో కూడా చేస్తారు. తీపి పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే తీపి తినాలనుకునే వాళ్లు.. బేకరీ స్వీట్ ఐటమ్స్ తినడానికి బదులుగా ఖర్జూరం లేదా జీడిపప్పు, పిస్తా, బాదం వంటి గింజలను తినడం ప్రారంభించండి. మార్కెట్‌లో చక్కెరతో కాకుండా స్వీట్‌లేని బిస్కెట్లు కూడా లభిస్తాయి. వీటిని తినడం అలవాటు చేసుకోండి.

అలాగే మీరు ఏదైనా ఆహారాలని కెచప్‌తో తినే అలవాటు ఉంటే మానుకోండి. కెచప్‌కి బదులు ఇంట్లో దొరికే చట్నీని తీసుకోండి. ఇది రుచితోపాటు ఆరోగ్యకరమైనది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు స్వీట్లు బాగా ఇష్టమైతే వీలైనంత త్వరగా ఆ అలవాటును వదిలేయండి. ఎందుకంటే వీటి తయారీలో శుద్ధి చేసిన చక్కెరను ఉపయోగిస్తారు. వీటికి బదులుగా సీజనల్ పండ్లను తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

శీతల పానీయంలో చక్కెర, సోడా రెండూ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి బదులుగా సహజ చక్కెరను కలిగి ఉన్న కొబ్బరి నీటిని తాగవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర శాతం పెరగదు. రుచికి రుచి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే కర్జూరతో ఇంట్లో స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన జీవితంలో చాలా వరకు భాగమైపోయిన చక్కెరను ఇలాంటి చిట్కాలతో దూరం చేయండి. సహజ సిద్ధంగా దొరికే వాటిని ఆహారంలో భాగం చేసుకోండి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Tags:    

Similar News