Women's Health: పురుషుల కంటే మహిళ్లలోనే వైద్య ఖర్చులు అధికం.. పరిశోధనల్లో వెల్లడి
Medical Expenses are more in women than men: పురుషుల కంటే మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి, మల్టిపుల్ స్క్లెరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితులు స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
Medical Expenses are more in women than men: పురుషులతో పోల్చితే మహిళల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇతర పరిశోధనలు పురుషులతో పాటు మహిళలు ఒకే మొత్తంలో ఖర్చు చేస్తారని చెబుతున్నప్పటికీ, తాజాగా నిర్వహించిన పరిశోధనలో మాత్రం మహిళలు ఆరోగ్య సేవలపై ఎక్కువ ఖర్చు చేస్తారని స్పష్టమైంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక చికిత్స అవసరం రావడం, కొన్ని అనారోగ్య సమస్యలు ఆలస్యంగా నిర్ధారణకావడం వంటి వైద్య ఖర్చులు పెరగడానికి కారణమవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
పురుషుల కంటే మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి, మల్టిపుల్ స్క్లెరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితులు స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇక 2021-22లో 88 శాతం మంది మహిళలు వైద్యుడిని సంప్రదించగా.. పురుషుల సంఖ్య 79 శాతంగా ఉంది. అయితే, 2020-21లో 4.3 శాతం మంది మహిళలు ఖర్చుల కారణంగా వైద్యులను సంప్రదించడం ఆలస్యం కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 2.7 శాతంగా ఉంది.
అలాగే ఎండోమెట్రియోసిస్, పెల్విక్ పెయిన్, మెనోపాజ్ వంటి పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నిర్ధారించడానికి, డబ్బుతో పాటు సమయం కూడా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు ఎండోమెట్రియోసిస్ నిర్ధారణకు సగటున ఆరున్నర నుంచి 8 సంవత్సరాలు పట్టొచ్చు. దీంతో మహిళలు ఎక్కువ వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఇది కూడా వైద్య ఖర్చులు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.
మహిళలు ఆరోగ్య సంరక్షణ కోసం అధిక ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. పలు రకాల అనారోగ్య సమస్యల్లో మహిళలు ఎక్కువసార్లు వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. దీనివల్ల తరచుగా సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా పనిచేసే ప్రదేశాల్లో వివక్షతకు గురవుతారు. దీనివల్ల మహిళల కెరీర్ వృద్ధిపై కూడా ప్రభావం పడుతుంది. ఇది ఆర్థికంగా వారిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంతరం తగ్గాలంటే.. మహిళల ఆరోగ్యంపై మరిన్ని పరిశోధనలు, పెట్టుబడులు వైద్య చికిత్సలు మెరుగుపరచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా చికిత్స ఖర్చులు తగ్గుతాయని, ఇది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు.