Health Tips: డయాబెటిస్‌ పేషెంట్స్‌కి ఇవి వరం.. ఎలా తీసుసుకోవాలో తెలుసా?

Update: 2025-01-13 13:47 GMT

Health Tips: డయాబెటిస్‌ పేషెంట్స్‌కి ఇవి వరం.. ఎలా తీసుసుకోవాలో తెలుసా?

Pista Benefits to Diabetic patients: డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక ప్రధాన అనారోగ్య సమస్యగా మారింది. దేశ జనాభాలో ఏకంగా 15.3 శాతం మంది అంటే సుమారు రూ. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. అయితే చాలా మందికి అసలు ఈ విషయం కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంతో పాటు, జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రీ డయాబెటిస్‌ను అదుపు చేయడంలో పిస్తా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ప్రీ డయాబెటిక్ కేసుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిని డయాబెటిస్‌గా పరిగణించరు. ఇది మధుమేహానికి ముందుగా వచ్చే పరిస్థితి. దీనిని సకాలంలో నియంత్రించకపోతే మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు తీసుకునే ఆహారంలో పిస్తాను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం టిఫిన్‌ చేసే ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు కనీసం 30 గ్రాముల పిస్తా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ప్రీ-డయాబెటిస్ సులభంగా అదుపులో ఉంటుందని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనల్లో భాగంగా 12 వారాల క్లినికల్ ట్రయల్‌ను నిర్వహించారు. ఉదయం రాత్రి పిస్తాలు తీసుకోవడం వల్ల ప్రీ-డయాబెటిక్ వ్యక్తుల్లో షుగర్‌ లెవల్స్‌ తగ్గినట్లు గుర్తించారు. రోజుకు రెండుసార్లు 30 గ్రాముల చొప్పున మొత్తం 60 గ్రాముల పిస్తా తినేవారి బరువు పెరగకపోవడం వల్ల వారిలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉండటమే అందుకు కారణమని భావిస్తున్నారు.

పిస్తాలో డైటరీ ఫైబర్‌తోపాటు అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడంలో దోహదపడుతుంది. అలాగే పిస్తాలో హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పిస్తాలోని మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. దీంతో గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. అందుకే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తీసుకునే ఆహారంలో పిస్తాలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News