Health Tips: దాల్చిన చెక్కతో ఇన్ని లాభాలున్నాయా? తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు

Update: 2025-01-15 14:52 GMT

Cinnamon Health Tips: వంటింట్లో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మసాల దినుసుల రూపంలో మనకు తెలియకుండానే వాటిని ఉపయోగిస్తుంటాం. ఇలాంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి. వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కతో తయారు చేసిన టీని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ దాల్చిన చెక్కతో చేసిన టీ తాగడం లేదా నేరుగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* దాల్చిన చెక్క గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే దాల్చిన చెక్కను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శారీరక బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఈ మసాలా ఉపయోగపడుతుంది.

* దాల్చినచెక్కను తీసుకోవడం వల్ల పురుషుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు దాల్చిన చెక్కను తీసుకోవాలి. దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది.

* బరువు తగ్గాలనుకునే వారికి కూడా దాల్చిన చెక్క దివ్యౌషధంగా పనిచేస్తుంది. దాల్చినచెక్క తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. ఇది జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది.

* దాల్చినచెక్క తీసుకోవడం కడుపు, జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా అపానవాయువు, గ్యాస్, అసిడిటీ, అజీర్తి అవకాశాలను తగ్గిస్తుంది.

* ఇక దాల్చిన చెక్క ముక్కను నేరుగా నోట్లో వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. లేదంటే.. టీ తయారు చేసుకొని తాగొచ్చు. అదే విధంగా దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని రోజూ తాగితే మార్పు మాములుగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Note: పైన తెలిపిన అంశాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి.

Tags:    

Similar News