Tulsi Gowda passes away: కాళ్లకు చెప్పులు లేకుండా పద్మశ్రీ అవార్డు అందుకున్న పెద్దావిడ.. తులసి గౌడ ఇక లేరు
Tulsi Gowda passes away: రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా సాగుతుండగా..తులసిగౌడ అనే పేరు ప్రకటించగానే ఓ పెద్దావిడ సాదాసీదాగా కాళ్లకు చెప్పులు లేకుండానే వచ్చి అవార్డును అందుకున్నారు. ఆమెనే తులసిగౌడ. ఇప్పుడు ఆమె మన మధ్యలో లేరు. చెట్టు తల్లి తులసి గౌడ మన మధ్య లేరు. తులసి గౌడ (86) ఉత్తర కన్నడ జిల్లా అంకోల్ తాలూకాలోని తన స్వగ్రామం హన్నాలిలో మరణించారు.
పాదరక్షలు లేకుండా, గిరిజనుల వేషధారణతో రాష్ట్రపతి, ప్రధాని సహా ఎందరో ప్రముఖుల సమక్షంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న వృక్షమాత తులసిగౌడ్ మన మధ్య లేరు. హల్కీ సామాజిక వర్గానికి చెందిన తులసి గౌడ (86) వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉత్తర కన్నడ జిల్లా అంకోల్ తాలూకాలోని తన స్వగ్రామం హన్నాలిలో సోమవారం మరణించారు.
తులసి గౌడ చెట్ల పట్ల ఆమెకు ఉన్న అద్భుతమైన ప్రేమ, భక్తికి "చెట్టు తల్లి" అని పిలుస్తారు. తన జీవితాంతం పర్యావరణ పరిరక్షణ, చెట్లు, మొక్కల సంరక్షణ కోసం పనిచేశారు. ఆమె అసాధారణ కృషి, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని,2021లో పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ముందు మూలికలు, మొక్కల పరిరక్షణలో ఆమె చేసిన విశేషమైన పాత్రకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందించారు. ఈ అవార్డును అందుకుంటున్నప్పుడు, ఆమె సాంప్రదాయ గిరిజన దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా రాష్ట్రపతి భవన్ కు రావడం అమె సరళత్వం ప్రజల హృదయాలను దోచింది.
తులసి గౌడ కర్నాటకలోని హల్కీ గిరిజనలో కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.తన చిన్నప్పటి నుండి తన తల్లి, సోదరీమణులతో కలిసి పనిచేయడం పనిచేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో తులసిగౌడ చదవుకోలేకపోయింది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో వివాహం చేశారు. కానీ ఆమె భర్త కూడా ఎక్కువ కాలం జీవించలేదు.
దీంతో తన జీవితంలో ఎదరువతున్న దుఃఖాన్ని, ఒంటరితనం నుంచి బయటపడేందుకు తులిసిగౌడ చెట్లను, మొక్కలను సంరక్షించడం ప్రారంభించింది.
ఆమె రాష్ట్ర అడవుల పెంపకం పథకంలో కార్మికురాలిగా చేరింది. 2006లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ట్రీ ప్లాంటర్ ఉద్యోగం సంపాదించి 14 ఏళ్ల పదవీకాలం తర్వాత 2020లో పదవీ విరమణ చేసింది. ఈ సమయంలో లెక్కలేనన్ని చెట్లను నాటింది. జీవ వైవిధ్య పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తులసి గౌడకు చెట్లు మొక్కల గురించి అద్భుతమైన జ్ఞానం ఉంది. అందుకే ఆమెను ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల మొక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆమెకు తెలుసు. ఏ మొక్కకు ఎంత నీరు ఇవ్వాలి, ఏ రకమైన నేలలో ఏ చెట్లు, మొక్కలు పెరుగుతాయి ఇవన్నీ తులసిగౌడకు తెలుసు.