Mistakes in Morning Time: ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధులు గ్యారెంటీ

Update: 2024-12-02 02:31 GMT

Mistakes in Morning Time: మనలో చాలా మంది ఉదయం లేవగానే చాయ్, కాఫీ తాగేస్..సమయం లేదంటూ బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే ఆఫీసులకు వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం లేవగానే చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకుని..వాటిని సరిదిద్దుకుంటే మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ మంచి అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.

లేచిన తర్వాత టెన్షన్ పడకూడదు:

చాలా మంది ఉదయం లేవడమే టెన్షన్ తో లేస్తుంటారు. ఆఫీసుకు, స్కూల్ కు, కాలేజీకి సమయం అయిపోతుందంటూ గబగబా రెడీ అవుతుంటారు. ఫలితంగా మాసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఆ రోజుకు కావాల్సిన కాయకూరలు ముందే కట్ చేసుకుని పెట్టుకోవడం, ఆఫీసుకు వేసుకునే దుస్తువులు ముందుగానే తీసి పెట్టుకోవడం, పనులన్నీ ముందురోజు రాత్రే ముగించుకుని పడుకుంటే తెల్లవారి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

కుడి పక్కకు తిరిగి లేవాలి:

ఉదయం నిద్ర లేచేటప్పుడు కొంతమంది వెల్లకిలా పడుకుని అదే పొజిషన్ లో లేస్తుంటారు. ఇలా చేస్తే నరాలు బిగుసుకుపోయి కండరాల్లో నొప్పి వస్తుంది. ఉదయం లేచేటప్పుడు మొదటగా కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదు

చాలా మంది సమయం అవుతుందని ఉదయం టిఫిన్ తినకుండా వెళ్తుంటారు. ఫలితంగా అధికబరువు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉదని Diabetes, Metabolic Syndrome and Obesityలో వెల్లడయ్యింది.

లేవగానే మొబైల్ చూడటం

చాలా మంది ఉదయం లేవగానే పక్కన ఉన్న ఫోన్ చేస్తుంటారు. లేదంటే ఫోన్స్ మాట్లాడుతుంటారు. చాటింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ప్రతికూల పరిస్థితులే తెచ్చిపెడతాయి. ఎందుకంటే ఏవైనా నెగెటివ్ మెసేజ్ లు మీకు చేరినప్పుడు మీ మనస్సంతా ఒత్తిడికి లోనవుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఉదయం ఫోన్ చూసే అలవాటు మానుకోవాలి.

ఉదయం ఇలా నిద్రలేవండి

ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిగ్గా ఉంటారు. శక్తి, ఉత్సాహం అందుతుంది. కొంతమంది ఉదయం లేవగానే అధిక బరువులు ఎత్తుతుంటారు. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఇలా చేస్తే కండరాల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్రించే సమయంలో శరీరంలో పెద్దగా కదలికలు లేకపోవడం వల్ల ఉదయం లేచే సమయానికి కండరాలు, ఎముకలు బిగుసుకుగా మారుతాయి. కాబట్టి వీటిని వెంటవెంటనే కదిలించడం, కఠినమైన వ్యాయామాలు చేయడం, బరువులు ఎత్తడం వంటివి చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News