Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉందా.? వెంటనే ఇలా చేయండి..!

Hemoglobin: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైన వాటిలో రక్తం ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-02 08:24 GMT

Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉందా.? వెంటనే ఇలా చేయండి..!

Hemoglobin: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైన వాటిలో రక్తం ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రక్తసరఫరా సక్రమంగా ఉంటే ఎలాంటి వ్యాధులు దరి చేరవు. గుండె మొదలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించేది రక్తమే. ఇలాంటి రక్తంలో ప్రధానమైంది హిమోగ్లోబిన్‌. ఎర్ర రక్త కణాలలో ఉండే ఈ ప్రోటీన్ వల్లే రక్తం ఎర్రగా ఉంటుంది. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లేది ఈ హిమోగ్లోబిన్‌.

అందుకే హిమోగ్లోబిన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అనారోగ్యంతో వైద్యులను సంప్రదిస్తే ముందుగా రక్త పరీక్షలో గమనించేది కూడా హిమోగ్లోబిన్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గితే దానిని రక్త హీనతగా చెబుతుంటారు. చిన్న పనులకే అలసిపోవడం, బలహీనత, తల తిరడం వంటి లక్షణాలన్నీ రక్త హీనత వల్లేనని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్‌ తగ్గినా హిమోగ్లోబిన్‌ తగ్గుతుంది. అందుకే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని రకాల వాటిని భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గకుండా ఉండాలంటే శరీరానికి ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ12 తగిన స్థాయిలో లభించాలి. ఇందుకోసం పాలకూర, బ్రోకలీ, బఠానీలు, గ్రీన్‌ బీన్స్‌ వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తాన్ని పెంచడంలో ఉపయోగపడుతాయి. ఇక విటమిన్‌ బీ12 ఎక్కువగా లభించే వాటిలో మాంసం, చేప, గుడ్డు, పాలు వంటి వాటిని భాగం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

అలాగే రెగ్యులర్‌ డైట్‌లో పాలకూర, బీట్‌రూట్, ధనియాలు, ఆపిల్, గుడ్డు వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో ఐరెన్‌ స్థాయిలను పెంచడంలో ఉపయోగపడుతుంది. చిక్కుళ్ళు, గింజలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాల్లో కూడా ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. అలాగే శరీరం ఐరన్‌ను సమర్థవంతంగా గ్రహించేలా చేయడంలో విటమిన్‌ సి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం నారింజ, నిమ్మ, కివి, బెర్రీలు వంటి వాటిని కచ్చితంగా తీసుకోవాలి.

తీసుకునే ఆహారంతో పాటు కొన్ని రకాల జీవనశైలి మార్పులను కూడా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రోజూ కొద్దిసేపు కచ్చితంగా వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. అలాగే మంచి నిద్రను కూడా సొంతం చేసుకోవాలి. ఇక పచ్చటి చెట్లు ఉండే ప్రదేశాల్లో కాసేపైనా గడపాలి. వాకింగ్‌ను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News