Mango Leaves: మామిడి ఆకులను ఇలా తీసుకుంటే.. మార్పులు మాములుగా ఉండవు..

Mango Leaves: మామిడి పండ్లు ఏడాదికి ఒకసారి వస్తాయి. కానీ మామిడి ఆకులు మాత్రం ఏడాదంతా కనిపిస్తాయి.

Update: 2024-12-17 10:30 GMT

Mango Leaves: మామిడి ఆకులను ఇలా తీసుకుంటే.. మార్పులు మాములుగా ఉండవు..

Mango Leaves: మామిడి పండ్లు ఏడాదికి ఒకసారి వస్తాయి. కానీ మామిడి ఆకులు మాత్రం ఏడాదంతా కనిపిస్తాయి. అయితే మామిడి ఆకులు అనగానే ఇంటి గుమ్మానికి కట్టుకునే తోరణాలు గుర్తొస్తాయి. అయితే మామిడి ఆకులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? మామిడి ఆకులను వేడి నీటిలో వేసి ఆ నీటిని తీసుకుంటే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మామిడి ఆకులతో చేసిన డికాషన్‌ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి ఆకులు ఔషధ గుణాలకు పెట్టింది పేరు. ప్రతీ రోజూ మామిడి ఆకుల నీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఉదయం మామిడి ఆకుల డికాషిన్‌ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అదనపు కేలరీలను బర్న్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. డయాబెటిస్‌ పేషెంట్స్‌కు కూడా మామిడి ఆకులు వరంలా చెప్పొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా మామిడి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి.

మామిడి ఆకులతో చేసిన డికాషిన్‌ తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. క్యాన్సర్‌, గుండె జబ్బుల వంటి తీవ్ర సమస్యలను సైతం మామిడి ఆకులు తగ్గిస్తాయి. మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, ఫ్లేవనాయిడ్లు , శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో అల్సర్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మామిడి ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. మామిడి ఆకులు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. బీపీతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే మామిడి ఆకులతో చేసిన టీని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News