Diabetes Patients: షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత సేపు నడవాలో తెలుసా..?
Diabetes Patients: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య ఎక్కువుతోంది.
Diabetes Patients: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య ఎక్కువుతోంది. వంశపారపర్యంగా కూడా ఈ వ్యాధి వస్తుందనే వాదనలు ఉన్నాయి. ఇక మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వల్ల తక్కువ వయసులోనే డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
దీంతో జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ కచ్చితంగా వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు కచ్చితంగా వాకింగ్‌ను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెబుతుంటారు. అయితే షుగర్ పేషెంట్స్ ఎంతసేపు వాకింగ్ చేయాలి.? వారానికి ఎంత సమయం కేటాయించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ రోగులు వారానికి కనీసం 150 నిమిషాలు నడవాలని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ కేర్ జర్నల్‌లో ఇందుకు సంబంధించి వివరాలను ప్రచురించారు. డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందడంలో వాకింగ్ ఉత్తమమైందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకి 30 నిమిషాల చొప్పున వాకింగ్ చేస్తే మంచిదని ఈ అధ్యయనంలో తేలింది.
ఇదిలా ఉంటే ఒకవేళ రోజులో ఒకేసారి అరగంట వాకింగ్ చేయడం కూదని వారు కూడా ఆ సమయాన్ని విభజించుకోవాలని సూచిస్తున్నారు. అయితే వాకింగ్ చేసే సమయంలో కనీసం 10 నిమిషాలు నాన్ స్టాప్‌గా కేటాయించాలని సూచిస్తున్నారు. ఇలా రోజుకు మూడు నుంచి నాలు సార్లు చేసినా ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇక నడిచే వేగం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు.
గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయులు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అదే విధంగా ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 10 నిమిషాలు వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా రక్కంలో చక్కెర స్థాయిలను అదుపులోకి తీసుకురావడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు. కనీసం రోజుకు 5వేల అడుగులు వేస్తే షుగర్ పేషెంట్స్‌కి ప్రయోజనం చేకూరుతుందని పరిశోధనల్లో తేలింది.
నోట్: ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.